తమిళనాడు గవర్నర్‌గా సీహెచ్.విద్యాసాగర్ రావు లేదా మోత్కుపల్లి?
తమిళనాడు రాష్ట్ర గవర్నర్‌గా మళ్లీ తెలుగుబిడ్డకే దక్కే అవకాశం ఉంది. ప్రస్తుత గవర్నర్ కె.రోశయ్య పదవీకాలం ఆగస్టు 31వ తేదీతో ముగిసింది. దీంతో తమిళనాడు రాష్ట్ర ఇన్‌చార్జ్ గవర్నర్‌గా బీజేపీ సీనియర్‌నేత, మహ
తమిళనాడు రాష్ట్ర గవర్నర్‌గా మళ్లీ తెలుగుబిడ్డకే దక్కే అవకాశం ఉంది. ప్రస్తుత గవర్నర్ కె.రోశయ్య పదవీకాలం ఆగస్టు 31వ తేదీతో ముగిసింది. దీంతో తమిళనాడు రాష్ట్ర ఇన్‌చార్జ్ గవర్నర్‌గా బీజేపీ సీనియర్‌నేత, మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావును నియమిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం ఆదేశాలు జారీచేశారు. తెలుగు నేత డాక్టర్ కొణిజేటి రోశయ్యను ఇంటికి పంపినా మరో తెలుగు నేతకే అదనపు బాధ్యతలు అప్పగించడం గమనార్హం.
కాగా ఈ స్థానం పూర్తిస్థాయిలో తెలుగుబిడ్డకే దక్కే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై బీజేపీలో రెండు రకాల వాదనలు వినవస్తున్నాయి. ప్రస్తుతానికి విద్యాసాగర్ రావుకు అదనపు బాధ్యతలుగా అప్పగించినప్పటికీ పూర్తిస్థాయి గవర్నర్‌గా ఆయన్నే ఇక్కడకు పంపే అవకాశముందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. లేనిపక్షంలో తెలంగాణకు చెందిన టీడీపీ నేత మోత్కుపల్లి నర్శింహులు రాష్ట్ర గవర్నర్‌గా వచ్చే అవకాశముందని తెలుస్తోంది.
నిజానికి టీడీపీకి గవర్నర్ పదవి ఇస్తామని బీజేపీ నేతలు చెప్పారని, దాంతో ఆది నుంచి పార్టీని నమ్ముకుని ఉన్న మోత్కుపల్లి నర్శింహులుకు ఆ పదవిని కట్టబెట్టేందుకు చంద్రబాబు సుముఖంగా ఉన్నారని గతంలోనే ప్రచారం జరిగింది. ఒకవేళ మోత్కుపల్లికి ఆ పదవి దక్కకుంటే మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న సీహెచ్.విద్యాసాగర్ రావును తమిళనాడుకు మార్చే అవకాశాలు ఉన్నట్టు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి.