Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బిడ్డలపై మమకారం మనుషులదే కాదు సమస్త జంతువులదీ... కాదంటారా?

రెండేళ్ల బాలిక ఇటీవలే ఉత్తర భారత్ లోని ఒక రాష్ట్రంలో దారి తప్పి అడివిలోకి వెళితే కోతులు దాన్ని చేరదీసి పెంచుకున్న వైనం చూసి దేశం దేశమే ద్రవించిపోయింది. కోతిలాగా బతకడం నేర్చుకున్న ఆ పాపను ఆసుపత్రిలో చేర్చి మళ్లీ మనిషిలా మారుస్తుంటే మా బిడ్డను ఏం చేస్త

బిడ్డలపై మమకారం మనుషులదే కాదు సమస్త జంతువులదీ... కాదంటారా?
హైదరాబాద్ , శనివారం, 13 మే 2017 (05:02 IST)
రెండేళ్ల బాలిక ఇటీవలే ఉత్తర భారత్ లోని ఒక రాష్ట్రంలో దారి తప్పి అడివిలోకి వెళితే కోతులు దాన్ని చేరదీసి పెంచుకున్న వైనం చూసి దేశం దేశమే ద్రవించిపోయింది. కోతిలాగా బతకడం నేర్చుకున్న ఆ పాపను ఆసుపత్రిలో చేర్చి మళ్లీ మనిషిలా మారుస్తుంటే మా బిడ్డను ఏం చేస్తున్నారు అంటూ ఆసుపత్రి చుట్టూ ఆ పాపను పెంచిన కోతులు చేరితే కన్నీళ్లు పెట్టని వారు లేరు. తల్లీ బిడ్డల బంధం ప్రపంచంలో మనుషులకే సొంతం కాదని కన్నబిడ్డకు ఏదైనా జరిగితే తల్లడిల్లిపోవడం అడవిలోని జంతువులకు కూడా సహజ లక్షణమేనని ఇప్పుడు మరొక కోతి ససాక్ష్యంగా ప్రపంచానికి చాటి చెబుతోంది. 
 
జబల్‌పూర్‌కి చెందిన అవినాశ్‌ లోథి అనే ఫొటోగ్రాఫర్‌ తీసిన ఓ ఫొటో చూస్తే కళ్లు చెమర్చక మానవు. సరదాగా కోతులన్నీ ఆడుకుంటుండగా అందులో ఓ పిల్ల కోతి ఒక్కసారిగా అపస్మారక స్థితికి చేరుకుంది. దానిని యథాస్థితికి తీసుకొచ్చేందుకు తల్లి కోతి చేసిన ప్రయత్నం, ఆ సమయంలో పిల్లకోతిని చేత్తో కాస్త పైకి లేపి తల్లి కోతి ఏడుస్తూ ఉండటం ఆ దృశ్యాలన్నీ అవినాశ్‌ తన కెమెరాతో క్లిక్‌మనిపించారు. ఆ కోతి పిల్ల ప్రాణానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కాసేపటి తరువాత అది మళ్లీ మామూలు స్థితికి వచ్చేసింది. అయితే తన పిల్లకి ఏమైందో అని తల్లికోతి పడిన ఆవేదన కలచివేస్తుంది. 
 
ఏప్రిల్‌లో జబల్‌పూర్‌లో కోతుల ఫొటోలను తీస్తుండగా ఈ ఘటన తారసపడిందని ఫొటోగ్రాఫర్‌ అవినాశ్‌ తెలిపారు. మనుషులతోపాటు జంతువులకు భావోద్వేగాలు ఉంటాయడానికి ఈ చిత్రం చక్కని నిదర్శనం. ఈ ప్రపంచంలో బిడ్డపై తల్లి చూపించే ఆత్మీయత వెలకట్టలేనిది. తల్లీబిడ్డల మధ్య బంధం మాటల్లో వర్ణించలేనిది.ఇది మనుషులకు మాత్రమే పరిమితం కాలేదు. సృష్టిలోని సమస్త జీవరాశులకూ అది జన్మతః వస్తోంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐటీ ఉద్యోగుల్లో ప్రతిభ లేమే సంక్షోభ కారణమా.. కోడిగుడ్డుపై బొచ్చు పెరకటం అంటే ఇదే మరి!