Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వేశ్యతో ఒక రాత్రి... ఆ అబ్బాయి జీవితాన్ని మార్చేసింది...

వేశ్యతో ఒక రాత్రి... ఆ అబ్బాయి జీవితాన్ని మార్చేసింది...
, శుక్రవారం, 28 డిశెంబరు 2018 (19:51 IST)
జీవితంలో అందరూ తప్పులు చేస్తారు.. అది మానవ సహజం. కానీ తెలియకుండా తప్పు చేస్తే ఫర్వాలేదు. కానీ తెలిసి తప్పు చేస్తే ఏమనాలి చెప్పండి. ముఖ్యంగా యువత చేసే తప్పులు అన్నీఇన్నీ కావు. వయస్సులో ఉన్నాం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తామని చాలామంది అనేస్తుంటారు. తప్పు చేస్తే ఆ క్షణం బాగుంటుంది కానీ. ఆ తప్పు వల్ల ఒక్కోసారి ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుందనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 
 
అలాంటి సంఘటనే ఒకటి తమిళనాడులోని వేలూరు జిల్లాలో జరిగింది. వేలూరు లోని ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల అది. నలుగురు స్నేహితులు నరేష్, రాము, రోహిత్, రాజు. గత మూడు సంవత్సరాల నుంచి రాము పుట్టినరోజును స్నేహితులు బాగా ఎంజాయ్ చేసేవారు. పుట్టినరోజు పబ్‌కి వెళ్ళడం.. పూటుగా మద్యం సేవించడం.. తరువాత హాస్టల్‌కు వచ్చేసేవారు. అయితే ఈసారి రాము బర్త్‌డేని గుర్తిండిపోయే విధంగా చేయాలనుకున్నారు.
 
కాల్ గర్ల్‌కు ఫోన్ చేశారు. అందరూ తలా కొంత డబ్బులు పోగేశారు. ఒక హోటల్ గదిని బుక్ చేశారు. నలుగురు స్నేహితులు గదికి వచ్చారు. రాము, నరేష్‌, రోహిత్ ముగ్గురూ ఆ యువతితో ఎంజాయ్ చేశారు. ఇక చివరగా మిగిలింది రాజు. లోపలికి వెళ్ళాడు. 26 యేళ్ళ యువతి. ఎంతో అందంగా ఉంది. పింక్ కలర్ శారీ కట్టుకుని కూర్చుంది. రమ్మనట్లు సైగ చేసింది. కానీ రాజు మైండ్ బ్లాంక్ అయ్యింది.
 
తల్లిదండ్రులు తనను ఎందుకు పంపారు. చదువుకుని ప్రయోజకుడిని అవ్వవాలని. అయితే ఇదంతా కరెక్టు కాదు అనిపించింది. అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు. స్నేహితులందరూ హేళన చేశారు. చేతకాని వాడు, మగతనం లేని వాడని బాధపెట్టారు. అయితే తను అదంతా పట్టించుకోలేదు. ఎందుకంటే తను ఎంత చెప్పినా నా స్నేహితులు పట్టించుకోరు. అందుకే సైలెంట్‌గా ఉండిపోయాడు. 
 
ఇంజనీరింగ్ పైన ప్రత్యేక దృష్టి పెట్టాడు. బాగా చదివి మంచి ఉద్యోగం సాధించాడు. ఇప్పుడు అత్త కూతురినే పెళ్ళి చేసుకుని జరిగిన విషయాన్ని మొదటి రోజు రాత్రి తన భార్యకి చెప్పాడు. తన నిర్ణయాన్ని హర్షించింది. ఈ విషయాన్ని తన ఫేస్ బుక్కులో తెలిపాడు రాజు. ఈ సందర్భంగా రాజు...  మీరు కూడా ఆలోచించండి.. చేస్తున్న పని తప్పు అని తెలిస్తే చివరి క్షణం వరకు అవకాశం మన చేతిల్లోనే ఉంటుంది. అప్పటి వరకు బ్యాలెన్స్ కాకపోతే మన జీవితాన్ని మనమే పాడుచేసుకున్నట్లు లెక్కవుతుందని చెబుతున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జియో న్యూ ఇయర్ బంపర్ ఆఫర్... 100% క్యాష్ బ్యాక్