నిట్ యూనివర్శిటీ (ఎన్‌యు) మొట్టమొదటిసారిగా నిర్వహించిన వినూత్నమైన అధ్యయనంలో విద్యార్థుల తల్లిదండ్రులు యూనివర్శిటీని తిరిగి తెరిచేందుకు తమ సంపూర్ణ మద్దతును తెలిపారు. ప్రస్తుతం నిట్ యూనివర్శిటీ (ఎన్‌యు)లో విద్యనభ్యసిస్తోన్న విద్యార్థుల తల్లిదండ్రులందరికీ ఈ అధ్యయనం నిర్వహించారు. ఈ ప్రశ్నావళిని తల్లిదండ్రులకు పంపించారు. వారి దగ్గర నుంచి 250 ప్రతిస్పందనలను తిరిగి తీసుకున్నారు.
ఈ అధ్యయనంలో అందుకున్న అతి కీలకమైన అభిప్రాయాలు ఈ దిగువ రీతిలో ఉన్నాయి.
1. 89.1 % మంది తల్లిదండ్రులు యూనివర్శిటీ తప్పనిసరిగా వేలి ముద్రల ద్వారా ప్రవేశాలకు బదులుగా యాక్సెస్ కార్డులను వినియోగించాలని అభిప్రాయ పడ్డారు.
2. రోజులో కనీసం ఐదుసార్లు అయినా వాష్‌రూమ్‌లను శానిటైజ్ చేయాలని 35.1% మంది భావించారు ; 31.7% మంది రోజులో ఐదుసార్లుకు మించి శానిటైజ్ చేయాల్సిన అవసరం ఉందని భావించారు.
3. అధికశాతం మంది తల్లిదండ్రులు (55% మంది) యూనివర్శిటీ ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లేందుకు విద్యార్థులకు పాస్‌లను మంజూరు చేయరాదని, సాధారణ పరిస్థితులు నెలకొనేంత వరకూ ఇది కొనసాగాలని ఆకాంక్షించారు. అంతేకాదు, ఫ్యాకల్టీ మరియు సిబ్బందిని సైతం క్యాంపస్ నుంచి బయటకు వెళ్లడాన్ని నిరోధించాలని వారు భావించారు.
4. 92.3% మంది తల్లిదండ్రులు భావిస్తున్నది ఏమిటంటే, యూనివర్శిటీ తప్పనిరిగా ఆధీకృత కోవిడ్-19 నెగిటివ్ పరీక్ష తప్పనిసరి అని క్యాంపస్‌లో ప్రవేశించక మునుపే నిబంధన విధించడంతో పాటుగా క్యాంపస్‌లో ప్రవేశించిన కొన్ని రోజుల తరువాత వారికి కోవిడ్ పరీక్ష చేయాల్సింగా కోరారు.
5. అధికశాతం మంది తల్లిదండ్రులు (68.1%) ఒక విద్యార్ధి గదిలోకి మరో విద్యార్థి ప్రవేశించడాన్ని తప్పనిసరిగా నిరోధించాలని, భౌతిక దూర కాలంలో అది ఆవశ్యకమని భావించారు.
ఇతర అభిప్రాయాలలో ఈ దిగువ అంశాలు ఉన్నాయి
1. యూనివర్శిటీ తప్పనిసరిగా బహుళ ఆహార ప్రాధాన్యతలను అందించాలి. అంతేకాదు, బయట ఆహారాన్ని విద్యార్ధులు ఆర్డర్ చేసినప్పటికీ లోపలకు అనుమతించరాదు.
2. తరగతి గదితో పాటుగా కేఫటేరియాలో కూడా విద్యార్థుల సీటింగ్‌ను తప్పనిసరిగా ఫిక్స్ చేయాలి.
3. విద్యార్థులు తిరిగి క్యాంపస్‌కు ప్రవేశించిన తరువాత క్రీడా కార్యక్రమాలను సైతం ఆరంభించాలి.
ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, ఇప్పటికే ఎన్‌యు పైన పేర్కొన్న చర్యలపై నిర్ణయం తీసుకోవడంతో పాటుగా సవివరమైన కోవిడ్ సంబంధిత భద్రతా మార్గదర్శకాలను అందుబాటులోకి ఉంచారు. ఎన్‌యు వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించిన చిత్రమూ అందుబాటులో ఉంచారు.
రెసిడెన్షియల్ విద్యాసంస్ధలను తిరిగి తెరువడమనేది ప్రస్తుత పరిస్థితులలో సందేహాస్పదంగా ఉంది. ఆయా ఇనిస్టిట్యూట్‌లు తీసుకునే భద్రతా చర్యలను గురించి రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలను తీసుకోవాల్సి ఉంది. రాజస్తాన్ ప్రభుత్వం ఇప్పటికే ఈ ఆడిట్‌లను నిర్వహించడం చేత యూనివర్శిటీ త్వరలోనే తిరిగి తెరుచుకుంటుందని ఆశిస్తున్నారు. దశలవారీగా విద్యార్థులు క్యాంపస్‌కు తిరిగి రానున్నారు.
ఈ అధ్యయనాన్ని తల్లిదండ్రుల నడుమ ప్రత్యేకంగా నిర్వహించారు. తద్వారా యూనివర్శిటీలో భద్రతా ప్రమాణాలను తల్లిదండ్రుల అంచనాలకు తగినట్లుగా నిర్వహిస్తున్నారని భరోసా కల్పించారు. అంతేకాదు, క్యాంపస్‌లో తల్లిదండ్రులు, విద్యార్థుల భద్రతకు భరోసానందిస్తూ వారికి సంతృప్తిని అందించే ఇతర చర్యలనూ తీసుకుంటున్నారనే భరోసానూ అందిస్తున్నారు. యూనివర్శిటీలో అందిస్తున్న కోర్సులన్నింటికీ తరువాత విద్యా సంవత్సరం కోసం అడ్మిషన్‌లు ఇప్పటికే తెరువబడ్డాయి.