70 ఏళ్ల వ్యక్తి తన 28 ఏళ్ల కోడలిని వివాహం చేసుకున్నాడు. ఈ 'జంట' ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. బర్హల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో చౌకీదార్‌గా పనిచేస్తున్న కైలాష్ యాదవ్ 12 సంవత్సరాల క్రితం తన భార్యను కోల్పోయాడు. అతని మూడవ కుమారుడు కూడా కొంతకాలం క్రితం మరణించాడు.
ఈ నేపథ్యంలో కైలాష్ తన వితంతువు కోడలు పూజను మళ్లీ వివాహం చేసుకున్నాడు. కైలాష్, ఇరుగుపొరుగు, గ్రామంలో ఎవరికీ సమాచారం ఇవ్వకుండా, పూజను నిశ్శబ్దంగా వివాహం చేసుకున్నాడు ఈ ఫోటో వైరల్ అయిన తర్వాత మాత్రమే ప్రజలకు దాని గురించి తెలిసింది.
బర్హల్‌గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ జెఎన్ శుక్లా మాట్లాడుతూ, తాను సోషల్ మీడియాలో ఫోటోను చూశానని, ఇప్పుడు వివాహం గురించి ఆరా తీస్తానని చెప్పారు.