Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్కూల్‌ నుంచి తిరిగొస్తున్న బాలికను లాక్కెళ్లి రేప్... నిందితుడికి 51 గుంజీల శిక్షతో సరి!

బీహార్‌లోని పంచాయితీ పెద్దలు ఓ బాలికను రేప్ చేసిన కామాంధుడికి అతి విచిత్రమైన శిక్షను విధించి తీర్పునిచ్చారు. ఆ శిక్షను చూసి గ్రామస్థులకు నోటమాలేదు. శిక్షలు ఇంత దారుణంగా కూడా విధిస్తారా... అని ఆశ్చర్యప

Advertiesment
51 Squats & A Rs 1000 Fine
, సోమవారం, 8 ఆగస్టు 2016 (11:58 IST)
బీహార్‌లోని పంచాయితీ పెద్దలు ఓ బాలికను రేప్ చేసిన కామాంధుడికి అతి విచిత్రమైన శిక్షను విధించి తీర్పునిచ్చారు. ఆ శిక్షను చూసి గ్రామస్థులకు నోటమాలేదు. శిక్షలు ఇంత దారుణంగా కూడా విధిస్తారా... అని ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఆ కఠినమైన శిక్ష ఏంటో తెలుసా... 51 గుంజీలు, వెయ్యి రూపాయల జరిమానా. ఈ దారుణ సంఘటన బీహర్‌లో జ‌రిగింది. 
 
ఆ వివరాలను పరిశీలిస్తే... బీహర్‌ జిల్లాలో బసెతా గ్రామానికి చెందిన దళిత బాలిక ఏడో తరగతి చదువుతుంది. పాఠశాల నుంచి తిరిగి ఇంటికి వస్తుండగా ఆకాశ్‌ అనే కామాంధుడు బాలికను బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. ఈ విషయం బయట చెబితే చంపేస్తానని బెదిరించాడు. భయాందోళనకు గురైన బాలిక ఈ విషయాన్ని ఎవ్వరికి చెప్పలేదు. అలా బెదిరిస్తూ ఆరు నెలల పాటు ఆ బాలికతో తన కామవాంచను తీర్చుకున్నాడు. చివరికి ఆ బాలిక గర్భం దాల్చడంతో అసలు విషయం బయటపడింది. చెల్లెలు గర్భం దాల్చిన విషయం అన్నయ్యకు తెలియడంతో అత్యాచారానికి పాల్పడిన యువకుడి కుటుంబ సభ్యులకు చెప్పాడు. 
 
అబార్షన్ చేసుకుని వస్తే పెళ్లి చేస్తామని యువకుడు కుటుంబ సభ్యులు బాలిక తల్లిదండ్రులను నమ్మించారు. వారి మాటలు నమ్మి ఆపరేషన్‌ చేయించుకుని వచ్చిన బాధిత బాలికకు నిరాశే ఎదురైంది. అసలు రేప్ నిజం కానేకాదని, దానికి రుజువులున్నాయా అని నిలదీసి అవమానించారు. దాంతో వ్యవహారం పంచాయతీకి వెళ్లింది. బాలికను యువకుడు మోసం చేశాడని తేలడంతో ఆ పంచాయతీ సభ్యులు యువకుడికి 51 గుంజీలు, రూ.1000ల జరిమానా విధించి చేతులు దులుపుకుంది. దీనిపై బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడు, పంచాయతీ సభ్యులపైన కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సినిమా ఛాన్స్‌లిప్పిస్తానని రెండేళ్ళుగా అత్యాచారం.. వర్థమాన నటి కలల్ని చిదిమేశాడు!