గురుగ్రామ్‌లోని లాఫోరెస్టా కేఫ్‌లో మౌత్ ఫ్రెష్‌నర్ అనుకోని డ్రై ఐస్ తిన్న ఐదుగురు వ్యక్తులు ఆసుపత్రి పాలయ్యారు. వారికి చికిత్స అందించిన వైద్యుడు డ్రై ఐస్ అనే పదార్ధం మరణానికి దారితీస్తుందని హెచ్చరించారు. గురుగ్రామ్‌లోని ఓ రెస్టారంట్‌కు డిన్నర్ చేసేందుకు వెళ్లిన ఐదుగురు వ్యక్తులు మౌత్ ఫ్రెష్‌నర్‌కు బదులుగా డ్రై ఐస్ తినడంతో రక్తం వాంతులతో తీవ్ర అశ్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్రకలకలం రేపింది. అసలేమిటీ డ్రై ఐస్.. ఇది తింటే ఏం జరుగుతోంది? అనే విషయాలు నెటిజన్లు ఇంటర్‌నెట్‌లో వెతికేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ప్రకారం.. డ్రై ఐస్ ప్రాణాంతక పదార్థం. ఒట్టి చేతులతో డ్రై ఐస్ తాకడం కూడా అత్యంత ప్రమాదకరం.
చేతులకు ఎల్లప్పుడూ గ్లౌజులు ధరించి మాత్రమే దీనిని వినియోగించాలి. డ్రై ఐస్‌తో ప్రధానంగా కార్బన్ డయాక్సైడ్ వాయువు విడుదల చేస్తుంది. డ్రై ఐస్ సబ్లిమేట్ అయినప్పుడు అది కార్బన్ డయాక్సైడ్‌గా మారుతుంది.
తగినంత వెంటిలేషన్‌లేని ప్రదేశాల్లో ఆక్సిజన్ స్థానభ్రంశం అయ్యేలా చేస్తుంది. ఇక డ్రై ఐస్‌ని తింటే ఏకంగా ప్రాణాలకే ముప్పు తలపెడుతుంది. నోరు, అన్నవాహిక, కడుపులోని కణజాలాన్ని స్తంభింపజేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.