కేరళను రుతుపవనాలు తాకిన వేళ.. భారీ వర్షాలు 43మందిని పొట్టనబెట్టుకుంది. యూపీలోని వివిధ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్ం కారణంగా ఆదివారం 43మంది ప్రాణాలు కోల్పోయారు. 43మంది మృతి చెందడంపై విచారం వ్యక్తం చేసిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ ఒక్కొక్క కుటుంబానికి రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.
ఈ క్రమంలో యూపీలోని ఉన్నావ్‌లో 8 మంది, కనౌజ్లో ఐదుగురు మృతి చెందారు. వర్షం ధాటికి లఖ్నవూలో ఓ ఇల్లు నేలమట్టమై ఆరుగురు మృతి చెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కుసుంభి ప్రాంతంలోనూ ఇల్లు కూలి 60 ఏళ్ల వృద్ధుడు మరణించాడు. రాగల 24 గంటల్లో వివిధ ప్రాంతాల్లో 50- 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.