Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వాంతులు చేసుకుంది.. అత్యాచారం నుంచి తప్పించుకుంది.. హుక్కా మత్తులో..?

స్నేహితురాలిపై అత్యాచారం చేయాలని భావించిన ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులకు తగిన శాస్తి జరిగింది. స్నేహితురాలికి హుక్కా మత్తులో ముంచి ఆమెపై అత్యాచారానికి పాల్పడాలని భావించిన దుండగులను పోలీసులు అరెస్ట

Advertiesment
4 minors held for raping tribal girl at hookah bar in Ghatkesar
, గురువారం, 17 నవంబరు 2016 (11:13 IST)
స్నేహితురాలిపై అత్యాచారం చేయాలని భావించిన ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులకు తగిన శాస్తి జరిగింది. స్నేహితురాలికి హుక్కా మత్తులో ముంచి ఆమెపై అత్యాచారానికి పాల్పడాలని భావించిన దుండగులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఘట్‌కేసర్‌లో చోటుచేసుకుంది. ఈ ఉదంతంలో హుక్కా కేంద్రం నిర్వాహకుడికి రిమాండ్ తప్పలేదు. 
 
వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంకు చెందిన విద్యార్థిని(17) ఘట్‌కేసర్‌ మండలం జోడిమెట్లలోని ఓ కళాశాలలో బి-ఫార్మసీ చదువుతోంది. స్థానికంగా ఓ ప్రైవేట్‌ వసతి గృహంలో ఉంటున్న ఆమెను ఈనెల 2న రాత్రి స్నేహితులైన ఇంజినీరింగ్‌ విద్యార్థులు హరీశ్‌, హేమంత్‌, అజయ్‌, సమీర్‌ ఓ హుక్కా సెంటర్‌కు తీసుకెళ్లారు. బలవంతంగా హుక్కా పీల్చేలా చేయడంతో ఆమె మత్తులో కిందపడిపోయింది. దీంతో ఆమెను వాహనంలో కీసరలోని హరీష్‌ స్నేహితురాలి ఇంటికి తీసుకెళ్లి మరుసటి రోజు ఉదయం ఘట్‌కేసర్‌లో వదిలేశారు. 
 
బాధితురాలు రాత్రి జరిగిన విషయాన్ని కొత్తగూడెంలోని తల్లిదండ్రులకు చెప్పింది. ఈ వ్యవహారంపై విద్యార్థిని తల్లిదండ్రులతో కలిసి ఈనెల 10న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మల్కాజిగిరి ఏసీపీ సందీప్‌ విచారణ చేపట్టారు. విచారణలో అత్యాచారం జరగలేదని తేలింది. హుక్కా మత్తు ప్రభావంతో విద్యార్థిని పలుసార్లు దుస్తులపై వాంతులు చేసుకుంది. దీంతో అత్యాచారం యోచన విరమించుకుని మళ్లీ ఆమెను వసతిగృహం వదిలేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గాలి కుమార్తె వివాహం.. అదిరిపోయే ఆంధ్రా స్టైల్ వంటకాలు.. రూ.650కోట్లు ఖర్చు నిజమేనా?