Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

39 మంది భారతీయులు సేఫ్.. అది జరిగితే చేతులు కట్టుకుని క్షమాపణలు వేడుకుంటా: సుష్మ

ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఐసిస్ చెరలో ఉన్న 39 మంది భారతీయులు క్షేమంగా ఉన్నట్లు విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. కాబూల్‌లో ఈ నెల 9న కిడ్నాప్‌కు గురైన కోల్‌కతా చెందిన సామాజి

Advertiesment
39 Indians abducted by Islamic State in Iraq are alive: Sushma Swaraj
, సోమవారం, 20 జూన్ 2016 (15:55 IST)
ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఐసిస్ చెరలో ఉన్న 39 మంది భారతీయులు క్షేమంగా ఉన్నట్లు విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. కాబూల్‌లో ఈ నెల 9న కిడ్నాప్‌కు గురైన కోల్‌కతా చెందిన సామాజిక కార్యకర్త జుడిత్ డిసౌజా (40)తో పాటు 39 మందిని విడిపించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సుష్మా స్పష్టం చేశారు. 
 
ఐసిస్ చెరలో ఉండే భారతీయులు హతమయ్యారని వస్తున్న వార్తలను సుష్మా స్వరాజ్ కొట్టిపారేశారు. ఈ విషయంలో అసత్యాలు చెప్పాల్సిన అవసరం లేదని.. ఒకవేళ తాను చెప్పే మాటలు అబద్ధమని తెలిస్తే.. సదరు కుటుంబీకులకు చేతులు కట్టుకుని క్షమాపణలు వేడుకుంటానని సుష్మా స్వరాజ్ తెలిపారు. ఐసిస్ చెరలో ఉన్న భారతీయులు సురక్షితంగా ఉన్నారనేందుకు, అలాగే వారు హతమయ్యారనేందుకు తగిన సాక్ష్యాధారాలు లేవన్నారు. కానీ వారు సజీవంగా ఉన్నారని చెబుతున్న తనపై వారిని వెతికి క్షేమంగా తీసుకురావాల్సిన బాధ్యత కూడా ఉందన్నారు.
 
బంగ్లాదేశ్‌లోని రామకృష్ణ మిషన్ యాజకుడు(ప్రీస్ట్)ని హత్య చేస్తామని వస్తున్న బెదిరింపులపై కూడా సుష్మా స్వరాజ్ స్పందించారు. ఈ వ్యవహారంపై బంగ్లాదేశ్ ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నట్లు సుష్మా స్వరాజ్ చెప్పుకొచ్చారు. బంగ్లాదేశ్‌లో హిందువులు, ముస్లింలు కానివారిపై జరుగుతున్న దాడులకు షేక్ హసీనా సర్కారు తగిన చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లై బిడ్డపుట్టాక ప్రేమలో పడిన మహిళ: ప్రియుడితో జంప్.. మళ్లీ భర్త వద్దకు ఎందుకొచ్చింది?