Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బోరుబావిలో చిన్నారి.. 110 అడుగుల లోతు.. నవ్వుతూ బయటికి వచ్చేసింది.. ఎలా?

బోరుబావిలో పడిపోయిన చిన్నారి ప్రాణాలతో బయటపడింది. 30 గంటల పాటు శ్రమించిన రెస్క్యూ టీమ్ చిన్నారిని సురక్షితంగా బోరుబావి నుంచి బయటికి తీసింది. స్థానికుల సహకారంతో 110 అడుగుల లోతున వున్న బోరుబావిలో పడిన చ

Advertiesment
బోరుబావిలో చిన్నారి.. 110 అడుగుల లోతు.. నవ్వుతూ బయటికి వచ్చేసింది.. ఎలా?
, గురువారం, 2 ఆగస్టు 2018 (12:24 IST)
బోరుబావిలో పడిపోయిన చిన్నారి ప్రాణాలతో బయటపడింది. 30 గంటల పాటు శ్రమించిన రెస్క్యూ టీమ్ చిన్నారిని సురక్షితంగా బోరుబావి నుంచి బయటికి తీసింది. స్థానికుల సహకారంతో 110 అడుగుల లోతున వున్న బోరుబావిలో పడిన చిన్నారి నవ్వుతూ బయటికి వచ్చింది. దీంతో రెస్క్యూ టీమ్ హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంది.  
 
వివరాల్లోకి వెళితే... బీహార్ రాష్ట్రం ముంగేర్‌లో మూడేళ్ల చిన్నారి ఇంటిముందు ఆడుకుంటూ సన బోరుబావిలో పడింది. 225 అడుగుల లోతు ఉన్న ఈ బోరుబావిలో.. చిన్నారి సన 110 అడుగుల దగ్గర ఇరుక్కుపోయింది. జూలై 31వ తేదీ మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. కానీ రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్ 30 గంటల పాటు పోరాడి.. ఆగస్ట్ ఒకటో తేదీ రాత్రి 10 గంటల సమయంలో చిన్నారిని సురక్షితంగా బయటకు తీశారు. 
 
బోరుబావిలోని చిన్నారి మరింత జారిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ తర్వాత నిరంతరం ఆక్సిజన్ పంపించారు. చిన్నారి భయపడకుండా ఉండేందుకు ఓ లైట్ కూడా బోరుబావిలోకి వేశారు. అదేవిధంగా చిన్నారి తల్లితో మాట్లాడిస్తూనే ఉన్నారు. పాప భయపకుండా, తవ్వకాల ద్వారా వచ్చే శబ్దాలతో బెంబేలెత్తుకుండా ఉండేందుకు తల్లితోపాటు తండ్రితోనూ మాట్లాడిస్తూనే ఉన్నారు. 
 
స్థానికులు కూడా తలా ఓ చేయి వేయటంతో.. బోరుబావికి సమాంతరంగా 110 అడుగుల గొయ్యి తీశారు. అక్కడ నేల కూడా మెత్తగా ఉండటం, రాళ్లు అడ్డురాకపోవటంతో పని సులభంగా ముగిసింది. ఇంకా చిన్నారి నవ్వుతూ బయటపడింది. అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అద్దె ఇళ్లు.. ఆధార్‌లో అడ్రెస్ మార్చుకోవాలంటే..? secret pin ద్వారా?