Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తమిళనాడులో 84 ఏనుగులు చనిపోయాయ్.. మగ ఏనుగులే అధికం: కాళిదాస్

ఏనుగుల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాష్ట్ర కొండ ప్రాంతాల భద్రత కమిటీ అధ్యక్షుడు కాళిదాస్ చెప్పారు. తమిళనాడు రాష్ట్రంలో గత ఏడాది 84 ఏనుగులు మృతిచెందాయని కాళిదాస్ తెలిపారు. కోయంబత్తూర్‌

తమిళనాడులో 84 ఏనుగులు చనిపోయాయ్.. మగ ఏనుగులే అధికం: కాళిదాస్
, బుధవారం, 11 జనవరి 2017 (09:22 IST)
ఏనుగుల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాష్ట్ర కొండ ప్రాంతాల భద్రత కమిటీ అధ్యక్షుడు కాళిదాస్ చెప్పారు. తమిళనాడు రాష్ట్రంలో గత ఏడాది 84 ఏనుగులు మృతిచెందాయని కాళిదాస్ తెలిపారు.

కోయంబత్తూర్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కాళిదాస్.. రాష్ట్రంలోని నీలగిరి, కోయంబత్తూరు, సత్యమంగళం, కడ రాష్ట్రంలోని నీలగిరి, కోయం బత్తూర్‌, సత్యమంగళం, కడలూర్‌, కేరళ, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో అధిక సంఖ్యలో ఏనుగులు మృతి చెందుతున్నాయని తెలిపారు. 
 
దేశవ్యాప్తంగా 1,000 నుంచి 1,500 వరకు ఏనుగులు ఉన్నాయని, పలు ప్రాంతాల్లో రైళ్లు ఢీకొని, అనారోగ్యంతో ఏనుగులు మృతి చెందుతున్నాయని తెలిపారు. గత యేడాది రాష్ట్రంలో 84 ఏనుగులు మృతి చెందగా వాటిలో మగ ఏనుగులు అధికమని చెప్పుకొచ్చారు.
 
అడవుల్లో కూడా కరువు చోటుచేసుకుంటుండడంతో జనవాసల్లోకి వస్తున్న ఏనుగులు మృత్యువాత పడుతున్నాయని చెప్పుకొచ్చారు. మానవులు అవసరాల నిమిత్తం ఆక్రమణలకు పాల్పడుతుండడంతో పర్యావరణం దెబ్బతినడమే కాకుండా వన్యమృగాలపై కూడా పడిందన్నారు. అంతేకాకుండా చట్టానికి విరుద్ధంగా రైతులు పంట పొలాల వద్ద విద్యుత కంచెలను ఏర్పాటుచేసుకోవడం, ఆ ప్రాంతాలకు వెళ్లిన ఏనుగులు విద్యుదాఘాతానికి గురై మృతి చెందుతున్నాయన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జల్లికట్టుపై సుప్రీం తీర్పు వెల్లడించాకే... కేంద్రం నిర్ణయం : మంత్రి అనిల్ దవే