Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమ్మ నగ్న ఫోటోలున్నాయని కామాంధుడి బ్లాక్‌మెయిల్.. యువతి బలవన్మరణం

ఓ కామాంధుడి బ్లాక్‌మెయిల్‌కు భయపడి ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మైసూరులో చోటుచేసుకుంది. తల్లి నగ్నఫోటోలు తన వద్ద ఉన్నాయని.. తాను చెప్పినట్లు వినాలని.. లేకుంటే సోషల్ మీడియాలో ఆ ఫోటోలను పోస

Advertiesment
అమ్మ నగ్న ఫోటోలున్నాయని కామాంధుడి బ్లాక్‌మెయిల్.. యువతి బలవన్మరణం
, శనివారం, 25 ఫిబ్రవరి 2017 (13:33 IST)
ఓ కామాంధుడి బ్లాక్‌మెయిల్‌కు భయపడి ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మైసూరులో చోటుచేసుకుంది. తల్లి నగ్నఫోటోలు తన వద్ద ఉన్నాయని.. తాను చెప్పినట్లు వినాలని.. లేకుంటే సోషల్ మీడియాలో ఆ ఫోటోలను పోస్ట్ చేస్తానని నిత్యం వేధిస్తూ వెంటాడిన ఆ కామాంధుడి చర్యలకు తాళలేక 21 ఏళ్ల యువతి బలవన్మరణానికి పాల్పడింది. 
 
వివరాల్లోకి వెళితే... మైసూరు సమీపంలోని బన్నూరుకు చెందిన నిందితుడు రవి పరారీలో ఉన్నాడు. తండ్రి లేకపోవడంతో.. తల్లి సంరక్షణలో ఉంటూ కాలేజీ చదువుకుంటున్న ఆ యువతి.. చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం సంపాదించుకోవాలనుకుంది. అంతలో ప్రేమ పేరుతో రవి వేధించాడు. అమ్మకు సంబంధించిన ఫోటోలున్నాయని లక్ష రూపాయలు ఇవ్వాలని.. చెప్పినట్లు వినాలని బెదిరించాడు. 
 
ఈ బెదిరింపులు ఆగకపోవడంతో పాటు స్నేహితుల ముందు ఆ కామాంధుడు బెదిరించడంతో అవమానానికి గురైన బాధితురాలు.. గురువారం అర్థరాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీనివాస్ మృతిపై కేటీఆర్ స్పందన... కేంద్రంతో చర్చిస్తా.. బిడ్డలు లేరు.. ఏం సమాధానం చెప్పాలి..?