Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సెల్ఫీ పిచ్చి... తండ్రి అరుస్తున్నా పట్టించుకోని 21 ఏళ్ల యువతి... చనిపోయింది...

సెల్ఫీ పిచ్చి గురించి వేరే చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఈ సెల్ఫీ పిచ్చితో ఎంతోమంది యువతీయువకులు తనువు చాలించారు. కొందరు వేగంగా వెళ్లే రైల్లో నుంచి తీయబోయి ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు ప్రవహించే నది ఒడ్డున నిలబడి తీస్తూ ప్రాణాలు పోగొట్టుకున్నవారు వున్నా

సెల్ఫీ పిచ్చి... తండ్రి అరుస్తున్నా పట్టించుకోని 21 ఏళ్ల యువతి... చనిపోయింది...
, గురువారం, 4 మే 2017 (18:43 IST)
సెల్ఫీ పిచ్చి గురించి వేరే చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఈ సెల్ఫీ పిచ్చితో ఎంతోమంది యువతీయువకులు తనువు చాలించారు. కొందరు వేగంగా వెళ్లే రైల్లో నుంచి తీయబోయి ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు ప్రవహించే నది ఒడ్డున నిలబడి తీస్తూ ప్రాణాలు పోగొట్టుకున్నవారు వున్నారు. ఇలా సెల్ఫీ మోజుతో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇలా సెల్ఫీ కోసం ప్రాణం పోగొట్టుకున్నది మరో యువతి. వివరాల్లోకి వెళితే... తమిళనాడుకు చెందిన 21 ఏళ్ల మీనాక్షి ప్రియ ఇంజినీరింగ్ స్టూడెంట్. 
 
శెలవులు కావడంతో ఫ్యామిలీ అంతా ముంబై పర్యటనకు వెళ్లారు. అక్కడికి వెళ్లాక... ఓ క్యాబ్ మాట్లాడుకుని నగరం అంతా పర్యటించే క్రమంలో బాంద్రా-వర్లి సీ లింక్ వద్ద ఆగారు. అక్కడ సముద్ర ఒడ్డున కొన్ని బండరాళ్లు బాగా నునుపు తేలి, వాటిపైకి సముద్రపు అలలు వస్తూ చూసేందుకు ఎంతో అందంగా కనిపించాయి. దీనితో మీనాక్షి అక్కడ సెల్ఫీ దిగాలని నిర్ణయించుకుంది. తన తల్లి సోదరిని తీసుకుని సెల్ఫీ తీసుకునేందుకు అటుగా వెళ్లింది. ఆ సమయంలో ఆమె తండ్రి... అక్కడికి వెళ్లొద్దంటూ కేకలు వేశాడు. 
 
ఐనా ఆమె పట్టించుకోలేదు. నున్నటి బండపైకి వెళ్లి సెల్ఫీ కోసం ప్రయత్నిస్తుండగా ఓ రాకాసి సముద్రపుటల ఆమెను ఢీకొట్టింది. దాంతో బ్యాలెన్స్ కోల్పోయి సముద్రంలో పడిపోయింది. నీటిలో మునిగిపోతూ... నాన్నా నన్ను రక్షించూ అంటూ కేకలు వేసింది. తన కుమార్తెను రక్షించలేని ఆమె తండ్రి గుండెలవిసేలా బోరుమని విలపించాడు. గజ ఈతగాళ్లు ఆమె కోసం గాలింపు చేసి ఆమె దేహాన్ని కనుగొన్నారు. అప్పటికే ఆమె మృత్యువాత పడింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆనం వికృత చేష్టలు అదుపులో పెట్టుకోకపోతే.. అంతే.. నటుడైతే బెస్ట్: వైకాపా అనిల్