Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉంటాయ్ : రాహుల్ గాంధీ

Advertiesment
rahulgandhi
, శుక్రవారం, 2 జూన్ 2023 (12:16 IST)
వచ్చే యేడాది భారత్‌లో జరిగే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్.. తాజాగా వాషింగ్టన్ నేషనల్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుతం భారత్‌లో ప్రతిపక్ష పార్టీలన్నీ చాలా ఐక్యంగా ఉన్నాయన్నారు. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలు ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తాయన్నారు. 
 
'వచ్చే రెండేళ్లలో కాంగ్రెస్‌ పార్టీ మరింత బలోపేతం అవుతుందని నేను విశ్వసిస్తున్నా. ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అఖండ విజయం సాధించి బీజేపీ పాలకులను ఇంటికి పంపించింది. త్వరలో జరగబోయే మూడు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కూడా చూడండి. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయనే దానిపై ఈ రాష్ట్రాల ఫలితాలు స్పష్టమైన సంకేతాలిస్తాయి. 
 
ఇప్పుడు భారత్‌లో ప్రతిపక్షాలు మరింత ఐక్యంగా ఉన్నాయి. విపక్ష పార్టీలతో కాంగ్రెస్‌ విస్తృతంగా సమావేశాలు జరుపుతోంది. విపక్షాల ఐక్యత సరైన మార్గంలో వెళ్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఖచ్చితంగా ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తాయని అన్నారు. 
 
ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాపులారిటీ గురించి ప్రశ్నించగా.. 'దేశంలోని అన్ని సంస్థలపై ప్రభుత్వం నియంత్రణ ఉంది. పత్రికారంగంపైనా వారు పట్టుబిగించారు. అయితే ఆ వార్తలను నేను ఎప్పటికీ నమ్మబోను' అని రాహుల్‌ సమాధానమిచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా కేసీఆర్ రికార్డు