ఐఏఎఫ్‌కి చెందిన సుఖోయ్-30, మిరాజ్-2000 జెట్‌లు మధ్యప్రదేశ్‌లో కూలిపోయాయి. ఈ సంఘటనను ధృవీకరిస్తూ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, త్వరితగతిన సహాయక చర్యలు పూర్తి చేస్తామన్నారు.
ఇందుకోసం వైమానిక దళానికి చెందిన అధికారులు సహకరించాలని ఆదేశించినట్లు తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ఎయిర్ బేస్ నుంచి సుఖోయ్-30, మిరాజ్-2000 విమానాలు ఆకాశంలో ఎగురుతుండగా.. ఈ ఘటన చోటుచేసుకుంది.
భారత వైమానిక దళానికి చెందిన ఈ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు సుఖోయ్-30, మిరాజ్-2000 శనివారం కూలిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
మోరెనా అదనపు పోలీసు సూపరింటెండెంట్ రాయ్ సింగ్ నర్వారియా మాట్లాడుతూ, విమానంతో పాటు అందులో ఉన్న వ్యక్తుల సంఖ్య గురించి నిర్ధారించడానికి వైమానిక దళం బృందం సంఘటనా స్థలానికి చేరుకుంటుందని చెప్పారు.