భారత్‌లో కరోనా మరోసారి కోరలు చాస్తోంది. మరోవైపు వ్యాక్సినేసన్ ప్రక్రియ కూడా వేగంగా జరుగుతోంది. ఇప్పటివరకు దేశంలో సుమారు 2.80కోట్ల మందికి కొవిడ్ వ్యాక్సిన్ అందించినట్లు అధికారులు తెలిపారు.
శుక్రవారం ఒక్కరోజే సుమారు 18.40 లక్షల మందికి వ్యాక్సిన్‌ను అందించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో 23,285 కేసులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
దీంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,97,237కి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో ఇన్‌ఫెక్షన్ 1.74 శాతంగా ఉంది. మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, పంజాబ్, కర్ణాటక, గుజరాత్‌లలో కరోనా కేసులు పెరుగుతున్నాయని.. కొత్త కేసులు 85.6 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. గత నెల నుండి ఇక్కడ కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయని తెలిపింది.