Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహారాష్ట్రలో ఘోరం : భవనం కూలి 15 మంది మృతి

Advertiesment
virar building collapse

ఠాగూర్

, గురువారం, 28 ఆగస్టు 2025 (10:45 IST)
మహారాష్ట్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని పాల్ఘర్ జిల్లాలో విరార్ ప్రాంతంలోని ఓ భవనం కూలిపోవడంతో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నారు. ఈ ఘటనలో భవనం యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. 
 
విరార్‌లోని నారింగ్ ఫాటా వద్ద ఉన్న రాము కాంపౌండ్‌లోని రమాబాయి అపార్టుమెట్ భవనం నాలుగో అంతస్తుకు చెందిన వెనుక భాగం ఒక్కసారిగా కూలిపోయింది. ఆ శిథిలాలు పక్కనే ఉన్న ఒక చాల్ మీద పడ్డాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే విరార్ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, రెండు జాతీయ విపత్తు స్పందన దళం బృందాలు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. 
 
సహాయక చర్యలు చేపట్టి శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీశాయి. అయినప్పటికీ 15 మంది ప్రాణాలు కోల్పోయారుు. గాయపడిన వారిని విరార్, నలసోపారోలేని ఆస్పత్రులకు తరలించారు. కొందరికి ప్రాథమిక చికిత్స అందించి డిశ్చార్జ్ చేశారు. సుమారు పదేళ్ల క్రితం నిర్మించిన ఈ భవనాన్ని అత్యంత ప్రమాదకరమైనదిగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు గతంలోనే గుర్తించి హెచ్చరికలు జారీచేసినట్టు సమాచారం. శిథిలాల కింద మరికొందరు ఉండొచ్చని అనుమానిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణాలో భారీ వర్షాలు... పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు