Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Rajasthan: రాజస్థాన్‌లో షాకింగ్ ఘటన- మైనర్ బాలికను బొలెరో కారులో కిడ్నాప్

Advertiesment
kidanappers

సెల్వి

, బుధవారం, 25 డిశెంబరు 2024 (13:28 IST)
kidanappers
రాజస్థాన్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సోమవారం నాడు 14 ఏళ్ల మైనర్ బాలికను బొలెరో కారులో ఆరుగురు దుండగులు కిడ్నాప్ చేశారు. ఆమె పరీక్ష రాసి తిరిగి వస్తుండగా, రాజస్థాన్‌లోని డీగ్ గ్రామమైన భరత్‌పూర్‌లోని పోలీస్ స్టేషన్ ముందు సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. 
 
సంఘటనా స్థలంలో ఉన్న ఇతర బాలికలు నిరసన వ్యక్తం చేయడంతో, దుండగులు గాల్లోకి కాల్పులు జరిపి బాలికను కిడ్నాప్‌ చేశారు. ఆరుగురు పురుషులపై అపహరణ, కాల్పుల కేసు నమోదు చేశారు.
 
వివరాల్లోకి వెళితే.. వరకట్నం వేధింపుల కారణంగా ఆమె పుట్టింటికి వచ్చిందని.. ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. ఈ కిడ్నాప్ వెనుక ఆమె అత్తమామలు ఉన్నారని ఆమె పట్టుబట్టారు.
 
ముగ్గురు నుండి నలుగురు వ్యక్తులు కారులో వచ్చి తుపాకీతో బెదిరించి ఆమెను అపహరించారు. స్థానికులు వారిని ఆపడానికి ప్రయత్నించినప్పుడు, వారు కొన్ని రౌండ్లు కాల్పులు జరిపారు. అయితే, ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని కమాన్ సర్కిల్ అధికారి గిర్రాజ్ మీనా అన్నారు.
 
డీగ్ జిల్లాలోని పహారీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీటీవీలో ఈ కిడ్నాప్ తతంగం రికార్డ్ అయ్యింది. కిడ్నాపర్లను పట్టుకోవడానికి మూడు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రేవతి కుటుంబాన్ని ఆదుకోండి.. అల్లు అర్జున్‌కు ఈటెల విజ్ఞప్తి