Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మైనర్ బాలికపై రెండుసార్లు గ్యాంగ్ రేప్.. వరి పొలాల్లోకి తీసుకువెళ్లి...?

ఓ మైనర్ బాలికపై రెండుసార్లు ఏడుగురు మైనర్ బాలురు గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన ఘటన మేఘాలయాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మేఘాలయాలోని ఖాసీహిల్స్ జిల్లా మావటెన్ గ్రామానికి చెందిన 11 ఏళ్ల బాలికను అదే

Advertiesment
11-Year-Old Gangraped Twice Allegedly By 7 Minors In Meghalaya
, సోమవారం, 23 జనవరి 2017 (10:05 IST)
ఓ మైనర్ బాలికపై రెండుసార్లు ఏడుగురు మైనర్ బాలురు గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన ఘటన మేఘాలయాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మేఘాలయాలోని ఖాసీహిల్స్ జిల్లా మావటెన్ గ్రామానికి చెందిన 11 ఏళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన ఏడుగురు మైనర్ బాలురు గత ఏడాది డిసెంబరు నెలలో వరిపొలాల్లోకి  తీసుకువెళ్లి గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. అప్పట్లో ఆ ఘటన వెలుగులోకి రాలేదు. దీంతో అదే బాలికపై ఈ నెల 13వతేదీన మళ్లీ పాత నిందితులే గ్యాంగ్ రేప్ చేశారు.
 
బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో ఎట్టకేలకు మేఘాలయ పోలీసులు రంగంలోకి దిగి ఐపీసీ 376 జి, పోస్టో చట్టాల కింద కేసు నమోదు చేసి 14 నుంచి 16 ఏళ్ల వయసున్న ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. అత్యాచార బాధితురాలిని జువైనల్ హోంకు తరలించారు. మేఘాలయలో గత ఏడాది 101 అత్యాచారం కేసులు నమోదుకాగా, ఇందులో 22 కేసులు మైనర్ బాలికలపై జరిగినవేనని క్రైంరికార్డ్సు బ్యూరో వెల్లడించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రత్యేక హోదా కోసం యువత కదిలితే వెనుక నిలుస్తా: పవన్ కల్యాణ్