Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వివాహేతర సంబంధం పెట్టుకుంటే ఆ మహిళకు భరణం కట్!

Advertiesment
వివాహేతర సంబంధం
FILE
వివాహేతర సంబంధం పెట్టుకునే మహిళలకు ముంబై కోర్టు సరైన తీర్పునిచ్చింది. వివాహమైన తర్వాత పర పురుషుడితో అక్రమ సంబంధం కలిగుంటే భర్త నుంచి భరణం పొందడానికి సదరు మహిళకు అర్హత లేదని ముంబై కోర్టు ఒకటి స్పష్టం చేసింది.

40 ఏళ్ల ముంబై వాసి ఒకరు భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని, తనకు విడాకులు ఇప్పించాలని కోరుతూ స్థానిక కోర్టును ఆశ్రయించారు. భార్య అక్రమ సంబంధానికి ఆధారాలను సమర్పించారు. వీటిని పరిశీలించిన కోర్టు విడాకులు మంజూరు చేసింది.

అయితే తాను జీవించడానికి సరిపడా మెయింటెనెన్స్ భర్త నుంచి ఇప్పించాలని ఆ మహిళ కోర్టును కోరగా, కోర్టు నిరాకరిస్తూ పై వ్యాఖ్యలు చేసింది. ఇంకా వివాహేత సంబంధం పెట్టుకున్న మహిళకు భర్త నుంచి భరణం ఇవ్వటం కుదరదని కోర్టు తేల్చి చెప్పేసింది.

Share this Story:

Follow Webdunia telugu