ప్రముఖ ప్రైవేట్ విమానయాన సంస్థలు కింగ్ ఫిషర్, జెట్ఎయిర్‌వేస్ సంస్థలు తమ సిబ్బందికి గత రెండు నెలలుగా వేతాలు చెల్లించడం లేదు. ఈ జాబితాలో తొలుత కింగ్ ఫిషర్ సంస్థ ఉండగా, ఇపుడు తాజాగా దేశంలోనే అతిపెద్ద ఎయిర్‌లైన్స్‌గా ఉన్న జెట్ ఎయిర్‌వేస్ కూడా గత రెండు నెలలుగా తమ సిబ్బందికి వేతనాలు చెల్లించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నట్టు సమాచారం.
అయితే గత కొంత కాలంగా భారత్‌లోని విమాన సంస్థలు ఒడుదుడుకులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వటంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ రెండు విమాన సంస్థలోనే కనీసం 18 వేల మంది ఉద్యోగస్తులు వివిధ శాఖలలో తమ విధులు నిర్వహిస్తున్నారు.
అయితే కింగ్ ఫిషర్ సిఈఓ సంజయ్ అగర్వాల్ తాజాగా సంస్థ ఎదుర్కొంటున్న పరిస్థితులు, అనుకోని కారణాల వల్ల సంస్థలో పని చేసే ఉద్యోగస్తులకు గత డిసెంబర్ నెల జీతాలు మరోసారీ ఆలస్యం కావొచ్చని సోమవారం ఈ-మెల్ పంపినట్లు సమాచారం.