ఛత్తీస్ఘర్లోని బస్తర్ ప్రాంతంలో జరిగిన మావోయిస్టుల దాడిలో 45 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది గల్లంతయ్యారు. ఈ విషయాన్ని సీఆర్పీఎఫ్ డీజీపీ విశ్వరంజన్ మాట్లాడుతూ... దంతెవాడ జిల్లాలోని ఎర్రబోరు ప్రాంతంలో మావోయిస్టులను పట్టుకోవటానికి వెళ్లిన భద్రతా దళాలు తిరిగి వస్తుండగా మావోయిస్టులు చుట్టిముట్టారని తెలిపారు.
ఈ సంఘటనలో భద్రతా దళ సిబ్బందిలో కొందరు మృతి చెందడమే కాకుండా, పలువురు గాయాల పాలయి ఉండవచ్చునని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. గల్లంతైన వారి ఆచూకీ తెలుసుకునేందు కోసం చర్యలు చేపట్టినట్టు ఆయన వివరించారు.