Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నగ్న శిల్పరూపం... అక్కడి విశేషం

Advertiesment
నగ్న శిల్పరూపం... అక్కడి విశేషం
FILE
విహార యాత్రలకు వెళ్లాలనుకునేవారు ఎక్కువగా పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, తమిళనాడులపై దృష్టి సారిస్తారు. తమిళనాడు సంగతి అలా ఉంచితే కర్నాటకలో పలు సందర్శనీయ ప్రాంతాలున్నాయి. ముఖ్యంగా శ్రావణ బెళగొళ. ఈ పేరు వినగానే గోమటేశ్వరుడి విశాలమైన, అతి ఎత్తైన విగ్రహం నగ్నరూపంలో పర్యాటకుల కళ్ల ముందు దర్శనమిస్తుంది.

ఇంద్రగిరి, చంద్రగిరిగా పేరుగాంచిన రెండు చిన్న పర్వతాల మధ్య ఈ భారీ విగ్రహం ఏర్పాటు చేసి ఉంటుంది. ఈ విగ్రహం ప్రతిష్టించిన ప్రదేశానికి సమీపంలో ఒక పెద్ద చెరువు ఉంది. ఇంద్రగిరి పర్వతంపై ఈ శ్రావణ బెళగొళ నిర్మతమై ఉన్నది. ఒకే శిలను చెక్కడం ద్వారా 58 అడుగుల గోమటేశ్వర విగ్రహాన్ని రూపొందించారు.

ఇది ఎంత విశాలమైందో చెప్పాలంటే విగ్రహం పెదవులను గమనించాల్సి ఉంటుంది. ఆ గోమటేశ్వరుడి పెదాలపై ఒక వ్యక్తి ఐదారడుగుల విస్తీర్ణంలో హాయిగా పడుకోవచ్చు. ఈ మూర్తిని దర్శించుకోవాలంటే నాలుగు వందలకుపైగా మెట్లు ఎక్కాల్సి ఉంటుంది.

ఈ విగ్రహాన్ని శిల్పకళలో అద్భుతమైన నమూనాగా వర్ణిస్తారు. దీనిపై లతలను, తీగలను ఎంతో బాగా తీర్చిదిద్దారు. ఇక్కడ ఐదొందలకు పైగా శిలాశాసనాలున్నాయి. ఇంద్రగిరి పర్వతం నుండి తొంగి చూస్తే నగర అందాలు కనువిందు చేస్తాయి. ఇక్కడి నుంచి చంద్రగిరి స్పష్టంగా కనిపిస్తుంది.

శ్రావణ బెళగొళలోని ఈ మహాబలి విగ్రహాన్ని జనర్ థల్ సేనా, తత్వవేత్త ఛవుందరాయలు తయారు చేయించారు. దీనికి నలువైపులా వ్యాపించిన నగరం చిన్నగా ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్న మఠాలు, శిల్ప కళాఖండాల కారణంగా ఒక ముఖ్య ఆకర్షణ కేంద్రంగా మారింది. దీనితోపాటు ఇంకా మైసూర్ ప్యాలెస్ ఇతర ఎన్నో అందాలను ఆస్వాదించవచ్చు. ఎలాగూ శెలవులు వస్తున్నాయి కదా... ఓసారి వెళ్లి వచ్చే ప్రయత్నం చేయండి.

Share this Story:

Follow Webdunia telugu