Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రకృతి అందాలతో అలరారుతున్న షే లోయ

ప్రకృతి అందాలతో అలరారుతున్న షే లోయ
, సోమవారం, 17 మార్చి 2008 (18:10 IST)
FileFILE
జమ్మూ ప్రాంతంలోని లడక్‌లో ఉన్న అందమైన గ్రామాల్లో షే చెప్పుకోదగినది. లే ప్రాంతానికి 15 కి.మీ దూరంలో ఉన్న షే లోయలు లడక్ భూభాగాన్ని ఆక్రమించాయి. వేసవి కాలంలో లడక్‌లోని పర్వతాలు, పచ్చని చెట్లు పర్యాటకులకు ఆహ్లాదాన్నిస్తాయి. రాకీ పర్వతాల మధ్య భాగంలో కుడి వైపున ఉన్న అన్ని లోయల తరహాలోనే షే లోయలు కూడా కొలువుదీరి ఉన్నాయి.

సూర్యుడి ప్రతాపం, గాలి, నీటి ప్రవాహాలు, మంచు తదితర ప్రకృతి అంశాల ఒరవడితో నేల కోతకు గురైన దృశ్యాలు ఈ ప్రాంతం నుంచి చక్కగా కనిపిస్తాయి. కాబట్టి, గాలి గట్టిగా వీచే సమయంలో బయటకి రాకపోవడమే మంచిది. కూరగాయలు, పళ్లను పండించేందుకు వేసవి కాలం అనువైనది. పక్కనే ఉన్న ఇండస్ నదిలోని నీళ్లను పరిసర గ్రామాల ప్రజలు అంతగా వాడుకోరు. వారి గ్రామాల్లో ప్రవహిస్తున్న వాగుల నీళ్లపైనే వీరు ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.

ఇక్కడి మరో రమణీయమైన ప్రదేశం షే ప్యాలెస్. అన్ని ప్యాలెస్‌ల లాగానే ఇది కూడా పర్వతాలపై నిర్మించబడింది. షే రాజు తప్పు చేసిన వారికి జైలు శిక్ష విధించే వారు కాదట. ఆయన బౌద్ధ స్థూపాలు నిర్మించాలని ఆదేశించి, నేరస్థులకు వైవిధ్య పూరితంగా శిక్షలు విధించేవారట. తద్వారా నేరస్థులు నేరాలను మాని, మంచి మార్గాన్ని అవలంబిస్తారని ఈ విధంగా ఆదేశించేవారట.

రాజ కుటుంబీకులు వింటర్ ప్యాలెస్‌గా వాడుకునే ఈ షే ప్యాలెస్‌ను 16వ శతాబ్దంలో నిర్మించారట. మట్టి, ఇటుకలు, చెక్క సామగ్రితో నిర్మించబడిన ఈ ప్యాలెస్ తర్వాతి కాలంలో స్టాక్‌కు బదిలీ చేయబడింది. ఈ ప్యాలెస్‌లోకి అడుగిడగానే లోహంతో చేసిన అందమైన స్థూపం దర్శనమిస్తుంది. ప్రస్తుతం ఈ ప్యాలెస్ ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి సంరక్షణలో ఉంది. ఆ ప్యాలె‌స్‌లోని కొన్ని వస్తువులు వాడకం లేకనో, మరో కారణం చేతనో శిధిలావస్థలో ఉండగా, గౌతమ బుద్ధుని నిలువెత్తు విగ్రహం లడక్ అందాలకు, ఆనాటి రాచరికపు వైభవానికి నిదర్శనంగా నిలుస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu