Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తవాంగ్ స్వర్ణ బౌద్ధ స్థూపం

తవాంగ్ స్వర్ణ బౌద్ధ స్థూపం

Pavan Kumar

అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా సరిహద్దు వద్ద ఉన్నది తవాంగ్ స్వర్ణ బౌద్ధ స్థూపం. దీనినే తవాంగ్ బౌద్ధ మఠము అని కూడా పిలుస్తారు. తవాంగ్‌ను అధికారికంగా భారత్ తమ భూభాగంలోకి గతంలో కలుపుకున్నప్పటికీ 2007లో అది తమదే నంటూ చైనా వివాదాన్ని లేవదీసింది. ఇక్కడే 6వ దలైలామా జన్మించాడన్న కారణంతో అది మాదే అని చైనా అంటోంది. ప్రస్తుత దలైలామా మనగడ్డపై ప్రవాస జీవితం గడుపుతున్నాడన్న విషయాన్ని చైనా మరుస్తోంది.

బ్రిటీష్‌వారు పోతూపోతూ భారత్-చైనాలు విభజించటానికి మెక్‌మోహన్ రేఖను సరిహద్దుగా మార్చారు. దానితో తవాంగ్ మఠము మనకు దక్కింది. అయినప్పటికీ అరుణాచల్ ప్రదేశ్‌లోని ఎక్కువ ప్రాంతాలు తమదేనంటూ చైనా వాదిస్తోంది. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని ఈశాన్య సరిహద్దు ఏజెన్సీగా పిలిచేవారు. ఇప్పటిదాకా ఉన్న రికార్డు ప్రకారం తవాంగ్ 1951 వరకూ టిబెట్ ప్రభుత్వ హయాంలో ఉండేది.

స్థానిక అరుణాచల వాసులు వాదన ఏమిటంటే భారత్‌తో ఉండాలన్నది తమ నిర్ణయం అంటారు. వారు హిందీ పాటలు, వినడం, మాట్లాడటం లేదా అర్థం చేసుకోవడం తెలుసు. అసోం భాషను తాము కనుగొన్నామని అంటారు. బాహ్య ప్రపంచంతో ఈశాన్యంలోని అసోంతో సంబంధం పెట్టుకున్నప్పుడు ఈ భాష ఏర్పడిందంటారు.

తవాంగ్ మఠము సముద్రమట్టానికి 3500 మీటర్లు ఎగువన 400 సంవత్సరాలు క్రితం ఏర్పడింది. దలైలామాకు చెందిన మహాయాన బౌద్ధంలోని గాలుపా వర్గానికి చెందిన అనుబంధం తవాంగ్. ఇందులో 700 మంది సన్యాసులు నివశించవచ్చు. ఈ మఠంలో బుద్ధుని అవశేషాలు భద్రపరిచారు.

మఠానికి అనుబంధంగా వస్తు ప్రదర్శనశాల కూడా ఉంది. ఇందులో ప్రాచీన తాళపత్ర గ్రంధాలు మరియు విలువైన పురాతన వస్తువులు వంటివి ఉన్నాయి. దలైలామా నేతృత్వంలో 1997లో పూర్తిగా దీనిని ఆధునీకరించారు. ఇక్కడి స్థానిక ప్రజలు మోన్పాస్ అంటారు. వీరు రాళ్లతో కట్టిన గృహాల్లో నివశిస్తూ వ్యవసాయం చేసుకుంటారు. టిబెట్ తరహా నేత పనులు వీరు చేస్తుంటారు.

తవాంగ్‌కు ప్రయాణించే మార్గంలో తేజ్‌పూర్ వస్తుంది. ఇది అసోంలో చాలా చిన్న పట్టణం. అరుణాచల్‌లోని మరో బౌద్ద మఠం బొమిడిలాకు వెళ్లే మార్గంలో ఉంది తేజ్‌పూర్. బహ్మపుత్రా నది ఎడమ గట్టున ఉంది తేజ్‌పూర్. తేజ్‌పూర్ గురించి చెప్పాలంటే 1962 నాటి చరిత్రలోకి వెళ్లాలి. చైనా పరిభాషలో దీనిని హిమాలయ తప్పు సంవత్సరం అంటారు. చైనా సైనికులు భారత సరిహద్దును దాటి కాల్పులు జరిపారు. ఈ సమయంలో తేజ్‌పూర్‌లో ఉన్న భారత ఆర్మీ తిప్పికొట్టింది.

Share this Story:

Follow Webdunia telugu