ఎప్పుడో పాతిక కోట్ల సంవత్సరాల క్రితం పుట్టి, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయి ఇటలీలోని "డోలోమైట్స్" పర్వతాలు. అందమైన "ఆల్ఫ్స్ పర్వతాల"లో భాగమే ఈ డోలోమైట్స్. ప్రపంచ వారసత్వ సంపదల్లో ఒకటిగా చేరి అరుదైన ఘనతను సంపాదించుకున్న డోలోమైట్స్... ప్రపంచంలోనే ఎంతో అందంగా కనిపించే పర్వాతాలుగా అలరిస్తున్నాయి.నిట్టనిలువుగా, కొనదేలిన శిఖరాలతో, చాలా ఇరుకైన లోయలతో కూడిన పర్వత శ్రేణులు ఈ డోలోమైట్స్‌లో కనిపిస్తాయి. వీటిమధ్యలో కనువిందు చేసే అద్భుతమైన దృశ్యాలెన్నో ఉంటాయి. వీటిలో కొన్నింటిపై పేరుకున్న మంచు.. హిమానీ నదులుగా మారుతాయి. వీటి పైనుంచి హిమపాతాలు (అవలాంచీ) చటుక్కున జారుతూ ఉంటాయి. |
మొదటి ప్రపంచ యుద్ధానికి మూగ సాక్షులైన ఈ డోలోమైట్స్ పర్వతాల్లో.. 1915 మే నుంచి 1917 అక్టోబర్ వరకూ ఇటలీ, ఆస్ట్రియా దేశాల సైనికులు 20 నెలలపాటు తలపడ్డారు. ఈ యుద్ధంలో ఇరువురూ ప్రయోగించిన బాంబులవల్ల కూడా ఈ పర్వతాలు రకరకాల ఆకారాల్లో ఏర్పడి చూపరుల కళ్లు... |
|
|
డోలోమైట్స్‌లో దాదాపు 18 శిఖరాలు 3 వేల మీటర్లు అంటే సుమారు పదివేల అడుగుల ఎత్తుగా నిలబడి అబ్బురపరుస్తుంటాయి. మొత్తం 1400 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉండే డోలోమైట్స్... మొదటి ప్రపంచ యుద్ధానికి మూగ సాక్షులు. ఎందుకంటే, 1915 మే నుంచి 1917 అక్టోబర్ వరకూ ఇటలీ, ఆస్ట్రియా దేశాల సైనికులు 20 నెలలపాటు వీటిల్లోనే తలపడ్డాయి కాబట్టి...!
విచిత్రం ఏంటంటే... ఇటలీ, ఆస్ట్రియా దేశాలు పోరాటంలో ప్రయోగించిన బాంబులవల్ల కూడా ఈ డోలోమైట్స్ పర్వతాలు రకరకాల ఆకారాలలో ఏర్పడి చూపరులను ఇట్టే ఆకర్షిస్తాయి. ఇప్పటికీ అక్కడ కనిపించే యుద్ధ గుర్తుల కోసం ఎంతోమంది పర్యాటకులు వస్తుంటారు. ఈ పర్వతాలలో వీరికోసం దాదాపు 500 స్కైలిఫ్ట్‌లు ఉన్నాయంటే, వీటికి ఎంత ప్రాముఖ్యం ఉందో అర్థం చేసుకోవచ్చు.
పెద్ద పెట్టెలాంటి దాంట్లో పర్యాటకులు కూర్చుంటే, యాంత్రిక కప్పీల సహాయంతో నిలువుగా లిఫ్ట్‌లాగా ఇవి పైకి వెళ్తుంటే.. చుట్టూ ఉండే దృశ్యాలను చూస్తూ సందర్శకులు మైమరచిపోతుంటారంటే అతిశయోక్తి కాదు. ఈ స్కై లిఫ్ట్‌లు సుమారు 750 మైళ్లు అంటే 12 వందల కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి.
అదలా ఉంచితే... డోలోమ్యూ అనే ఫ్రెంచ్ ఖనిజ శాస్త్రజ్ఞుడు ఈ పర్వతాల శిలలపై పరిశోధనలు చేసి, ఇవి ప్రత్యేకమైన కర్బన పదార్థంతో కూడిన డోలోమైట్ అనే రాయితో ఏర్పడ్డాయని కనుగొన్నాడు. దీంతో ఈ పర్వతాలకు డోలోమైట్స్ పర్వతాలు అనే పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది.
ఈ డోలోమైట్స్ పర్వతాలలో చెప్పుకోవాల్సిన విచిత్రం మరోటుంది. అదేంటంటే.. 25 కోట్ల సంవత్సరాల క్రితం ఈ పర్వతాలు సముద్రంలోంచి పొడుచుకొచ్చాయి. అందువల్లనే నీరు, మంచు, గాలుల కారణంగా చిత్రమైన ఆకారాలను ఇవి సంతరించుకుని మనల్ని చూపు మరల్చుకోనీయకుండా చేస్తాయి. రకరకాల రంగుల్లో ఉండే వాటిని చూసేందుకు మన రెండుకళ్లూ సరిపోవు.
బూడిద రంగు, మట్టిరంగు, తెలుపు, నీలం రంగుల్లో ఉండే ఈ పర్వతాలు మన కళ్లను ఏ మాత్రం పక్కకు తిప్పనీవు, దృష్టిని మరల్చనీవు. అంత అందంగా, సుమనోహరంగా ఉంటాయవి. అందుకే ఎంత కష్టసాధ్యమయినా సరే ఈ పర్వతాలను ఎక్కేందుకు పర్వతారోహకులు బారులు తీరుతుంటారు. ఇక పర్యాటకుల సంగతయితే చెప్పనవసరం లేదు. వీరు ఆయా మార్గాలు, సౌకర్యాల ద్వారా డోలోమైట్స్ పర్వాతాలను వీక్షించేందుకు ప్రపంచం నలుమూలల నుంచీ తరలివస్తుంటారు.
ఇదిలా ఉంటే... యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) ప్రపంచంలోని 13 దేశాలను కొత్తగా వారసత్వ సంపదల జాబితాలో చేర్చింది. వీటిలో ఇటలీలో నెలవైన "డోలోమైట్స్ పర్వతాలు" కూడా స్థానం సంపాదించాయి. కాగా... స్పెయిన్ కేంద్రంగా పనిచేసే యునెస్కో సంస్థ వివిధ దేశాల్లోని ప్రకృతి, సాంస్కృతికపరమైన అద్భుత ప్రదేశాలు గుర్తించి, వాటిని పరిరక్షించేందుకు చర్యలు చేపడుతోంది. ఇలా వీరు ఇప్పటిదాకా 890 ప్రదేశాలను గుర్తించి, పరిరక్షిస్తున్నారు.