Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కొచ్ వంశస్థుల స్థలం కూచ్ బెహార్

కొచ్ వంశస్థుల స్థలం కూచ్ బెహార్

Pavan Kumar

, సోమవారం, 2 జూన్ 2008 (20:52 IST)
ఉత్తర బెంగాల్‌ను పాలించిన కొచ్ బెహార్ వంశస్థుల రాజధాని కూచ్ బెహార్. కొచ్ బెహార్ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో ఒక జిల్లా. కూచ్ బెహార్ హిమాలయ పర్వత పాద ప్రాంతంలో ఉంది. ఉత్తర బెంగాల్‌లో ప్రణాళిక బద్ధంగా నిర్మించిన పట్టణం కూచ్ బెహార్. కొచ్ వంశస్థుల దాదాపు 400 ఏళ్లపాటు కూచ్ బెహార్‌ను రాజధానిగా చేసుకుని పరిపాలించారు.

పొరుగున ఉన్న భూటాన్ కూడా కొంత కాలం వీరి పాలనలోకి వచ్చింది. కొచ్ బెహార్ అనే పదం కొచ్ తెగల నుంచి వచ్చింది. కొచ్ బెహార్ అంటే కొచ్ రాజులు తిరిగే ప్రాంతమని అర్ధం. కూచ్ బెహార్ ప్రాంతం 4-12 శతాబ్దాల మధ్య కామరూప రాజ్యం పరిధిలో ఉండేది. కూచ్ బెహార్ పట్టణం తోర్సా నది ఒడ్డున ఉంది.

చూడవలసిన ప్రాంతాలు
విక్టోరియా జూబిలీ ప్యాలెస్
మహారాజా నృపేంద నారాయణ్ వివాహం బ్రాహ్మోను వివాహమాడిన సందర్భంగా 1878లో ఈ ప్యాలెస్ నిర్మాణ పనులు చేపట్టారు. లండన్‌లోని బకింగ్‌హాం ప్యాలెస్ తరహాలో ఈ భవంతిని నిర్మించారు. రాజా నృపేంద్ర నారాయణ్ సమయంలోనే ఆధునిక కూచ్ బెహార్ నిర్మాణ పనులు మొదలయ్యాయి.

మదన్‌మోహన్ దేవాలయం
కొచ్ రాజులు వంశాచారంగా పూజిస్తూ వచ్చే దేవాలయం మదన్‌మోహన్. ఉత్తర బెంగాల్ వాసులు ఆర్భాటంగా చేసుకునే రాస్ జాత్రా ఉత్సవం ఇక్కడ భారీఎత్తున జరుగుతుంది.

బాణేశ్వర్ దేవాలయం
అలిపురద్వార్‌కు వెళ్లే దారిలో ఉంది బాణేశ్వర్ దేవాలయం. ఇక్కడ తాబేళ్లకు ప్రసిద్ధి.

వసతి
కూచ్ బెహార్‌లో వివిధ తరగతుల వారికి అనుకూలంగా వసతి సదుపాయాలు ఉన్నాయి.

ఎలా చేరుకోవాలి
విమాన మార్గం : బాగ్‌డోగ్రా (160 కి.మీ.) సమీపంలోని విమానాశ్రయం. ఇక్కడి నుంచి న్యూఢిల్లీ, గౌహతి, కోల్‌కతాలకు విమాన సేవలు ఉన్నాయి. కూచ్ బెహార్‌లో విమానశ్రయం కూడా ఉంది. ప్రస్తుతం ఇది పనిచేయటం లేదు.

రైలు మార్గం : కూచ్ బెహార్‌కు 5కి.మీ. దూరంలో న్యూ కూచ్ బెహార్ రైల్వే స్టేషన్ ఉంది. గౌహతి-కతిహార్ ప్రధాన రైలు మార్గంలో ఉంది న్యూ కూచ్ బెహార్ స్టేషన్. ఇక్కడి నుంచి దేశంలో అన్ని ప్రాంతాలకు రైలు సేవలు ఉన్నాయి.

రహదారి మార్గం : ఉత్తర బెంగాల్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎన్‌బీటీసీ) రాష్ట్రంతో పాటుగా పొరుగున ఉన్న అసోం, బీహార్‌లకు బస్సు సేవలు నడుపుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu