'శివ శివ శంభో' నామ స్మరణతో మార్మోగుతున్న శ్రీశైలం!
, బుధవారం, 26 ఫిబ్రవరి 2014 (11:32 IST)
శ్రీశైలానికి వెళ్లే నల్లమల దారులు భక్తులతో నిండిపోయాయి. "శివ శివ శంభో" అంటూ భక్తుల శివనామస్మరణతో శ్రీశైల గిరులు మార్మోగిపోతున్నాయి. గురువారం నాడు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. పాతాళగంగతో పుణ్య స్నానాలు ఆచరించిన అనంతరం భక్తులు మల్లిఖార్జునుని దర్శించుకునేందుకు బారులు తీరారు. గంటల తరబడి క్యూ లైన్లలో నిరీక్షించి మరీ స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.