లోకహితం కోసం శివుడు ఎన్ని రూపాలు ధరించాడు?
, సోమవారం, 24 ఫిబ్రవరి 2014 (16:31 IST)
ఓంకార స్వరూపుడైన శివుడు లోకహితం కోసం ఎన్ని రూపాలు ధరించాడు. ఈ విషయంపై శివపురాణం ఓసారి తిరగేస్తే.. అందులో శివుడు ఎనిమిది రూపాలు ధరించినట్టు పేర్కొంటోంది. అవేంటంటే... రుద్రుడు : దుఃఖ నివారకుడైన అగ్నిని అధిష్టించి ఉంటాడు. శర్వుడు : జీవుల మనుగడ కోసం భూమిని అధిష్టించి ఉంటాడు. భవుడు : ఈ జగానికి అత్యంతావశ్యకమైన జలాన్ని ఆశ్రయించి ఉంటాడు. ఉగ్రుడు : జగత్తు కదలికలకు కారకుడైన వాయువును అధిష్టించి ఉంటాడు. భీముడు : ఆకాశాన్ని ఆశ్రయించి ఉంటాడు. పశుపతి : సంసారబద్ధులైన జీవులను పాపవిముక్తులను చేసేందుకై జీవాత్మను అధిష్టించి ఉంటాడు. ఈశానుడు : ఈ చరాచర జీవులను శాసించే సూర్యునిలో ప్రకాశిస్తుంటాడు. మహాదేవుడు : తన చల్లని కిరణాలతో జీవులను పాలించు చంద్రునిలో ప్రకాశిస్తుంటాడు.