Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహాశివరాత్రి: శివపూజకు శ్రేష్టమైన పుష్పాలేంటో తెలుసా?

Advertiesment
మహాశివరాత్రి
, సోమవారం, 17 ఫిబ్రవరి 2014 (16:37 IST)
మహాశివరాత్రి రోజునే కాదు.. శివుడిని ప్రతిరోజూ పుష్పాలతో పూజిస్తే పది అశ్వమేధ యాగాలు చేసిన ఫలం లభిస్తుంది. ఎవరైతే కనీసం ఎనిమిది పుష్పాలతో శివుని పూజిస్తారో వారికి కైలాసప్రాప్తి కలుగుతుంది. శివుని పూజకు ఉపయోగించే పువ్వులు వాడిపోయేవిగా ఉండకూడదు.

కీటకాడులతో కొరకబడినవిగా ఉండేవి శివ పూజకు పనికిరావు. అలాగే ఇతరుల పూతోటలో పూచిన పువ్వులను దొంగతనంగా తీసుకువచ్చి పూజిస్తే ఫలితం కనిపించదు. ఇంకా పాపం కలుగుతుంది.

శివపూజకు అరణ్యంలో పూచిన పువ్వులకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. గన్నేరు, పొగడ, జిల్లేడు, ఉమ్మెత్త, కలిగొట్టు, పెద్దములక, తెల్లదింటెన, కట్లతీగ పువ్వులు, అశోకపువ్వు, మందారం, విష్ణుక్రాంత, జమ్మి, మారేడు దళాలు, కుసుమపూవులతో శివపూజ చేయవచ్చు.

ఇంకా కుంకుమపూవు, ఎర్రకలువలు, నీలిపూలు, గులాబి, నెమ్మిపూలు, ఉత్తరేణి, తామర, జాజి, చెంగలువ, సంపెంగ, వట్టివేరు పూలు, నందివర్థనం, నాగకేసరం, పొన్న, పచగోరింట, తుమ్మి, మేడి, జయంతి, మల్లె, మోదుగ శివపూజకు ప్రశస్తమైనవని పండితులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu