శివపద మణిమాలలో 'శి' అనగా, శివుడనియు 'వ' అనగా శక్తి స్వరూపమని చెప్పబడియున్నది. ఈ శివరాత్రినాడు విశేషమయిన కాలం లింగోద్భవకాలం. ఈ కాలం రాత్రి 11.30 నుంచి 1 గంట వరకు ఉంటుంది.
ఆ సమయంలో నిర్మల మనస్సుతో శివపంచాక్షరీ జపిస్తూ ఉపవాస దీక్షతో పార్థివ లింగానికి పూజాభిషేకాలు చేసి మొదటి జాములో పాలతోను, రెండవజాములో పెరుగుతోను అర్చించాలి.
అలాగే మూడవ జామునందు నెయ్యితోను, నాల్గోజాము నందు తేనెతోనూ అర్చించినట్లైతే ఉమాశంకరులకు అత్యంత ప్రీతికరమని, అలాగే లక్షబిల్వార్చన ఆచరించినవారికి విశేష పుణ్యఫలం సిద్ధిస్తుందని పండితులు అంటున్నారు.