Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహాశివరాత్రి: మాఘ మాసంలో శివుడిని బిల్వముతో అర్చిస్తే?

Advertiesment
మహాశివరాత్రి
, మంగళవారం, 18 ఫిబ్రవరి 2014 (12:44 IST)
FILE
మహాశివరాత్రి రోజునే కాదు.. ఏయే మాసంలో ఏయే పూలతో పరమేశ్వరుడిని పూజిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవండి. చైత్రమాసంలో శంకరుని దర్భ పువ్వులతో పూజిస్తే బంగారం వృద్ధి చెందుతుంది. వైశాఖమాసంలో శివుని నేతితో అభిషేకిస్తూ తెల్లని మందారాలతో పూజిస్తే వారికి అశ్వమేధఫలం కలుగుతుంది.

జ్యేష్ఠ మాసంలో పెరుగుతో అభిషేకిస్తూ తామరపువ్వులతో పూజించిన వారికి పరమగతి కలుగుతుంది. ఆషాఢమాసంలో కృష్ణ చతుర్ధశినాడు స్నానం చేసి శివునికి గుగ్గిలంతో ధూపం వేసి తొడిమల తోడిమాలతో కూడిన పుష్పాలతో అర్చించినవారికి బ్రహ్మలోకాన్ని పరమపదం లభిస్తుంది.


శ్రావణమాసంలో ఒంటి పూట భోజనం చేస్తూ గన్నేరుపూలతో శివుని పూజించినవారికి వేయిగోదానముల ఫలం లభిస్తుంది. భాద్రపద మాసంలో శివుని ఉత్తరేణి పూలతో పూజించిన వారు హంసధ్వజంతో కూడిన విమానంలో పుణ్యపదానికి చేరుకుంటారు. ఆశ్వయుజమాసంలో పరమశివుని జిల్లేడుపూలతో పూజించినవారు మయూర ధ్వజంతో కూడిన విమానంలో దివ్యపదాన్ని చేరుతారు.

కార్తీకమాసంలో శివుని పాలతో అభిషేకించి జాజిపూలతో పూజించినవారు శివపదాన్ని దర్శించుకుంటారు. మార్గశిర మాసంలో శివుని పొగడపూలతో పూజించినవారు, ముల్లోకాలను దాటి తామున్నచోటికే తిరిగిరాగలరు. పుష్యమాసంలో శివుని ఉమ్మెత్త పూలతో పూజించినవారు పరమ పదాన్ని పొందగలరు.

మాఘ మాసంలో శివదేవుని బిల్వదళాలతో అర్చించినవారు, లేత సూర్యుడు, చంద్రుడులున్న విమానంలో పరమపదానికి వెళతారు. ఫాల్గుణమాసంలో శివుని సుగంధజలంతో అభిషేకించి తుమ్మిపూలతో పూజించినవారికి ఇంద్రుని సింహాసనంలో అర్ధభాగం దక్కుతుంది.

Share this Story:

Follow Webdunia telugu