ఈనెల 13వ తేదీ నుంచి శ్రీశైలం బ్రహ్మోత్సవాలు
, ఆదివారం, 12 ఫిబ్రవరి 2012 (09:05 IST)
జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం మహాక్షేత్రంలో ఈనెల 13వ తేదీ నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలు వచ్చే 23వ తేదీ వరకు అంగరంగ వైభవంగా వైభవంగా జరుగనున్నాయి. 13న వృద్ధ మల్లికార్జునస్వామి ఆలయంలో ఉదయం 9.15 గంటలకు యాగశాల ప్రవేశంతో అర్చకులు ఉత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. అనంతరం 14వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ప్రతిరోజూ శ్రీభ్రమరాంభ మల్లికార్జునస్వామి ఆలయంలో ఉదయం నిత్యహౌమ బలిహరణలు, స్వామివారికి విశేషఅర్చనలు, అమ్మవారికి నవావరణార్చనలు, హామాలు కొనసాగుతాయి.