Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీశైల పుణ్య‌క్షేత్రం శివ‌రాత్రికి సిద్ధం, భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

Advertiesment
srisailam maha shivaratri
, ఆదివారం, 6 మార్చి 2016 (18:11 IST)
శివ‌రాత్రి సంద‌ర్భంగా శ్రీశైలం పుణ్య క్షేత్రానికి భ‌క్తులు తండోప‌తండాలుగా చేరుకుంటున్నారు. మ‌రోప‌క్క శ్రీశైలం మల్లికార్జున స్వామి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శివ‌రాత్రికి ఇక్క‌డ ఉండాల‌ని వేలాది భక్తులు భారీగా తరలి వస్తున్నారు. స్వామి వారి దర్శ‌నానికి వచ్చే భక్తులకు ఎలాంటి అవాంతరాలు క‌ల‌గ‌కుండా ఆలయ అధికారాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 
 
దీక్ష తీసుకున్న భక్తులు పాతాళగంగలో స్నానామాచారించేందుకు విశేషంగా తరలి వస్తున్నారు. స్నానాల ఘట్టాల దగ్గర స్త్రీలకు ప్రత్యేక‌ గదులు ఏర్పాట్లు చేసారు. మరోవైపు పాతాళగంగ దగ్గరికి వెళ్ళడానికి కాలినడకతో పాటు రోప్ వే ద్వారా కూడా భక్తులు చేరుకుంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu