Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శివ.. శివ.. అంటే పాపాలు పోతాయి.. శివరాత్రి రోజున ముక్కంటిని దర్శించుకుంటే?

పూర్వం రాక్షసులు శివరాత్రి పూజ చూసి, సుషుప్తి దశలో శివ శివ అని మంత్ర పఠనం చేశారని, దానితో వారి పాపాలు మటుమాయమయ్యాయని విశ్వాసం. అలాంటి మహిమాన్వితమైన మహాశివరాత్రి పర్వదినం రోజున శివరాత్రి వ్రతం ఆచరించాల

Advertiesment
Shivaratri puja
, మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (19:07 IST)
పూర్వం రాక్షసులు శివరాత్రి పూజ చూసి, సుషుప్తి దశలో శివ శివ అని మంత్ర పఠనం చేశారని, దానితో వారి పాపాలు మటుమాయమయ్యాయని విశ్వాసం. అలాంటి మహిమాన్వితమైన మహాశివరాత్రి పర్వదినం రోజున శివరాత్రి వ్రతం ఆచరించాలని సంకల్పం చేసుకొన్నవారు ఉదయాన లేచి దినకృత్యాలు పూర్తిచేసి స్నానమాచరించి ఆలయానికి వెళ్లాలి. శివుని దర్శనం చేసుకోవాలి. భక్తులు ఉపవాస దీక్ష బూని శివపురాణం చదవాలి. రాత్రి పూర్తి శివనామం జపిస్తూ జాగరణం చేయాలి. శివపురాణ కథలను వినాలి. నాలుగు యామాల పూజ జరపాలి. 
 
అలాగే శివరాత్రి రాత్రి పూట ఆలయాల్లో పూజ జరుగుతుంది. ఆలయ గర్భగుళ్లలోని శివలింగాలని పూలతో, బిల్వపత్రితో అలంకరిస్తారు. రుద్రం, నమకం, చమకం పఠనం జరుపుతారు. ప్రత్యేక అభిషేకాలు జరుపుతారు. శివరాత్రి రోజున శివుని దర్శనం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి. శివరాత్రి రోజున శివుడిని దర్శనం చేసుకోవడం ద్వారా శుభకార్యాలు నిర్వహించిన ఫలితం దక్కుతుందని పండితులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శివరాత్రి రోజున పూజ ఎలా చేయాలి? కైలాస వాసం ప్రాప్తించాలంటే..?