Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శివోహం శివోహం... నిర్వాణ షట్కం... పాప్ గాయని స్మిత గానం(వీడియో)

శివోహం శివోహం... నిర్వాణ షట్కం... పాప్ గాయని స్మిత గానం(వీడియో)
, శుక్రవారం, 4 మార్చి 2016 (22:10 IST)
మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం, నచ శ్రోత్వ జిహ్వే నచ ఘ్రాణ నేత్రే,
నచ వ్యోమ భూమిర్నతేజో న వాయు, చిదానంద రూపం శివోహం, శివోహం.
 
ఇది శంకర భగవాత్పాదుల వారు నిర్వాణ షట్కంలో చెప్పిన మొదటి శ్లోకం. ఈ శ్లోకంలో 'నేను' అంటే ఏమి కాదో విశదీకరించారు శంకరులవారు. మిగిలిన ఐదింటిలోనూ ఇదే కనబడుతుంది.
 
సామాన్య మానవుడు తన శరీరమే తాను అని అనుకుంటే మరింత లోతుగా యోచన చేసుకునేవారు పంచజ్ఞానేంద్రియాలు, పంచభూతాలు, అంతఃకరణాల గురించి అనుకుంటారు. ఐతే సామాన్య ప్రజలు, మేధావులు కూడా చెప్పేవేమీ కాదని శంకరాచార్యులవారు చెపుతూ వాటి గురించి తను తెలుసుకున్నట్లు ఈ శ్లోకంలో చెప్తారు. అన్ని శ్లోకాలలోనూ చివర్లో చిదానంద రూపం శివోహం శివోహం అని ఉంటుంది. దీనర్థం నేను అనేది ఆనంద స్వరూపమైన శివం. అందుకే, నేనే ఆ శివాన్ని అని వివరిస్తున్నారు.
  
అద్వైత సిద్ధాంతంలో ఏకత్వాన్ని ప్రతిపాదించే ఈ శ్లోకాలను నిర్వాణ షట్కం అని చెప్తారు. నిర్వాణం అంటే మహోతృష్టమైన, గొప్పదైన జ్ఞానం అని అర్థం అంటే... బ్రహ్మజ్ఞానం పొందడమన్నమాట. ఈ మొదటి శ్లోకంలో ఆదిశంకరచార్యులు శివోహం అంటూ అదే నేను అని చెప్పకనే చెప్పారు. ఈ శ్లోకాలను పాప్ గాయని స్మిత శుక్రవారం నాడు విడుదల చేశారు. వీడియో చూడండి.
 

Share this Story:

Follow Webdunia telugu