13న మహాశివరాత్రి.. శివపూజకి ఆ పూవు వాడకండి..
ఫిబ్రవరి 13న మహాశివరాత్రి పర్వదినం వస్తోంది. ఈ రోజున ఉపవాసం, జాగరణ చేయడం ఉత్తమం. అయితే అనారోగ్యం వున్నవారు ఉపవాసానికి దూరంగా ఉండి.. శివాలయాల్లో జరిగే పూజలో పాల్గొనడం చేయవచ్చు. శివపూజకు మొగలిపూవును వాడ
ఫిబ్రవరి 13న మహాశివరాత్రి పర్వదినం వస్తోంది. ఈ రోజున ఉపవాసం, జాగరణ చేయడం ఉత్తమం. అయితే అనారోగ్యం వున్నవారు ఉపవాసానికి దూరంగా ఉండి.. శివాలయాల్లో జరిగే పూజలో పాల్గొనడం చేయవచ్చు. శివపూజకు మొగలిపూవును వాడకుండా వుండటం మంచిది. ''అభిషేక ప్రియ నమః శివాయ'' అంటే శివునికి అభిషేకాలంటే మహాప్రీతి.
అందుకే శివరాత్రి రోజున శివునికి జరిగే అభిషేకాలను కళ్లారా చూసే వారికి ఈతిబాధలంటూ వుండవు. శివరాత్రి రోజున సాత్విక ఆహారం తీసుకోవాలి. పిండిపదార్థాలు తీసుకోవచ్చు. ప్రాతః కాలంలో నిద్రలేచి.. శుచిగా స్నానమాచరించి.. ఉతికిన వస్త్రాలను ధరించాలి.
దేవాలయాలకు వెళ్లి శివుడిని దర్శించుకుని.. ఉపవాసం వుండేవారు పండ్లు, పాలు, ఫలహారాలను తీసుకోవాలి. వీలైనంత వరకు జాగరణ చేయాలి. శివునికి చేతనైన అభిషేకం చేయించాలి. పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ వుండాలి. శివాలయాల్లో జరిగే అభిషేకాలు పాలు, రోజ్ వాటర్, పన్నీర్, చందనం, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, నీరు, బిల్వ పత్రాలు సమర్పించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు.