రొమాంటిక్ సాంగ్ వినిపిస్తే అమ్మాయి ఫ్లాట్
రొమాంటిక్ సంగీతాన్ని వినిపిస్తే అమ్మాయిలు బుట్టలో పడతారట. ముఖ్యంగా అబ్బాయిలు తను ప్రేమించాలనుకున్న అమ్మాయి వద్దకు వెళ్లిన ప్రతిసారి ఏదో సందర్భాన్ని కల్పించుకుని తన వద్దనున్న రొమాంటిక్ పాటలను ఆమెకు వినిపించగలిగితే సదరు అబ్బాయంటే తెలియకుండానే అమ్మాయికి ఇష్టం కలుగుతుందట.రొమాంటిక్ పాటలు అమ్మాయిల మనసులపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయనే అంశంపై ఇటీవల ఓ అధ్యయన బృందం పరిశోధనలు చేసింది. ఈ పరిశోధనలో భాగంగా 18 నుంచి 20 ఏళ్ల మధ్యగల 90 మంది అమ్మాయిలకు రొమాంటిక్ పాటలు వినిపించారు. ఈ పాటలను కూడా ఒక్కో అమ్మాయికి ఒక్కో అబ్బాయి చేత వినిపించారు. అలా కొన్ని రోజులపాటు ఈ కార్యక్రమాన్ని సాగించారు. చివరికి రొమాంటిక్ సంగీతం వినిపించే అబ్బాయి కనపడకపోతే ఆ అమ్మాయిలు చెప్పలేని బాధను అనుభవించడాన్ని గమనించారు. ఈ విషయంపై అమ్మాయిల వద్ద ఆరా తీస్తే... సదరు అబ్బాయి లేనిదే కాలం చాలా భారంగా తోస్తోందనే సమాధానం ఇచ్చారట. కొంతమందైతే తమ మనసులను ఉల్లాసంలో తేలియాడించిన ఆ అబ్బాయే తమ బాయ్‌ఫ్రెండ్ అని ప్రకటించేశారట. రొమాంటిక్ సంగీతానికి ఎంత పవర్ ఉందో తెలుసుకున్నారుగా.