గుసగుసలాడితే గమ్మత్తుగా ఉంటుంది. మరి ఆ గుసగుసలు ఆడుకునే వారిలో ఒకరికి అవేమిటో వినిపించకపోతే...
మీ ప్రేమికుడు రోజూ మీకు హాయ్ చెప్పేసి తన పనిలో తాను మునిగిపోతున్నాడని మీరు బాధపడుతుంటే... ఇదిగో ఈ చిట్కాను పాటించండి. రోజులాగానే మీ ప్రేమికుడు మీకు హాయ్ చెప్పేసి తన పనిలో తాను మునిగిపోగానే... అతని దగ్గరకు హడావుడిగా వెళ్ళండి.
చెవి దగ్గరకు చేరి గుసగుసలు చెప్పండి. అతడికి వినపడనట్లుగా చెపితే మరీ మంచిది. అలా చెప్పినట్లుగా నటించి మీ దారిన మీరు పోతూ వెనుదిరిగి చూసి, అయోమయంగా చూస్తున్న మీ ప్రేమికుని వైపు ఓ లుక్కిచ్చి అర నవ్వు నవ్వండి.
మీరు చెప్పిందేమిటో తెలుసుకోవడానికి మీ ప్రేమికుడు మీ చుట్టు తిరగడంతో మీ ఇద్దరి మధ్య మీరు కోరుకునే సాన్నిహిత్యం పెరుగుతుంది.
ప్రేమస్తు..