Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ లక్షణాలున్న వ్యక్తినే స్త్రీలు ఎక్కువగా ఇష్టపడతారట!

Advertiesment
What Women Love About Men
, శనివారం, 15 నవంబరు 2014 (16:33 IST)
పురుషులకు ఉండాల్సిన లక్షణాలు కొన్ని వున్నాయి. వాటినే స్త్రీలు ఎక్కువగా ఇష్టపడతారు. మంచి డ్రెస్సింగ్ సెన్స్, ఆర్థిక పరంగా నిలదొక్కుకోగలిగే సామర్థ్యం, ఎల్లప్పుడూ నీట్‌గా ఉండే తత్త్వం అంటే స్త్రీలకు ఎక్కువగా నచ్చుతాయట. 
 
అలాగే పురుషుడి నుంచి మహిళ విశ్వాసాన్ని ఆశిస్తుందని, తనపై నమ్మకాన్ని ఉంచాలని ఆశిస్తుందని మానసిక నిపుణులు అంటున్నారు. అలాగే పురుషుల నుంచి వచ్చే సువాసనకు చాలామంది మహిళలు ఆకర్షితులవుతున్నారని తాజా అధ్యయనంలో తేలింది. 
 
వ్యక్తిగతం పరిశుభ్రంగా మంచి సువాసనతో ఉన్నపురుషులు ఇతర లక్షణాల్లో కూడా ప్రాధాన్యత కలిగి ఉంటారని స్త్రీలు నమ్ముతారు. ఆర్థికపరమైన విషయంలో స్త్రీలు సీరియస్‌గా ఆలోచిస్తున్నారు. ఆర్ధికపరంగా నిలదొక్కుకొనే సత్తా అతనిలో ఉందా లేదా అని చూస్తారు. అదే వారు కోరుకుంటారు. ఇక ఫర్ఫెక్ట్ బాడీ షేప్, హ్యాండ్సమ్ పర్సన్ భర్తగా, బాయ్ ఫ్రెండ్‌గా స్త్రీలు కోరుకుంటారని సైకాలజిస్టులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu