మీ ప్రేయసి దృష్టిలో సూపర్ మాన్‌గా ఉండిపోవాలంటే? ఏం చేయాలో తెలుసా? మీ లవర్‌కి రక్షణ కల్పించేలా ఉండాలి. స్త్రీలు రక్షణ కల్పించేవాళ్ళను ఇష్టపడతారు. కాబట్టి మీ ప్రియురాలు బాధలో ఉన్నపుడు మీరు ఆమె సంరక్షకుడిగా నిరూపించుకోవడానికి ఒకటికంటే ఎక్కువ మార్గాలను ప్రదర్శించండి. స్త్రీలు వివాదాల సమయంలో ఎవరు అండగా నిలబడతారో వారిని ఎప్పుడూ అభిమానిస్తారు. అటువంటి పరిస్థితులు మీ వద్దకు వచ్చినపుడు ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోండి.
అప్పడప్పుడు సర్‌ప్రైజ్ ఇవ్వండి. చాక్‌లేట్లు, లవ్ నోట్స్, బహుమతులు లేదా అనేక ఫ్లవర్స్ వంటి సర్‌ప్రైజ్‌లను స్త్రీలు ఇష్టపడతారు. స్త్రీలకూ ఎన్ని ఇచ్చినా వారికి అభ్యంతరం ఏమీలేదు. మీరు ఈ ఒక్క విషయంపై అనేక మార్కులను పొందవచ్చు.
ఇకపోతే పారదర్శకంగా ఉండండి. నిజాయితీగా ఉండడం ఎప్పటికీ మంచి పద్ధతి. మీరు మీ అనుబంధాన్ని ఎక్కువకాలం నిలబెట్టుకోవాలి అంటే ఆమెకు అబద్ధాలు చెప్పకూడదు. ప్రారంభంలో ఎన్ని విమర్శలను ఎదుర్కున్నా ఫరవాలేదు, కానీ చివరకు మీరు ఆమె మనసును గెలుచుకుంటారు.