Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Valetines Week 2021: ప్రపోజల్ డే గురించి తెలుసా?

Advertiesment
Valetines Week 2021: ప్రపోజల్ డే గురించి తెలుసా?
, సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (12:26 IST)
Propose Day
ఫిబ్రవరి నెల పెట్టగానే యువతీ మువకుల మదిలో మెదిలేది ప్రేమ, వాలెంటైన్స్ డే ఆలోచనలు తలెత్తుతాయి. ప్రతి ఏడాది ఫిబ్రవరి 14న ‘వాలెంటైన్స్ డే’గా జరుపుకుంటారు. ప్రేయసి, ప్రేమికుడు తమ మనసులోని భావాలను చెప్పేందుకు ఒక ప్రత్యేకమైన రోజు ఉంది. ఈ రోజుకు వారం రోజుల ముందే వాలెంటైన్స్ వీక్ ప్రారంభం అవుతుంది. ఈ క్రమంలో ఆదివారం రోజ్ డే కాగా, నేడు ఫిబ్రవరి 8న ప్రపోజ్ డే. 
 
ప్రేమను కొన్ని విధాలుగా వ్యక్తం చేయవచ్చు. ఇందుకోసం ప్రేమికులు ఏయే మార్గాలను ఎంచుకోవాలన్నదే ఈ రోజుటి ప్రధాన ఉద్దేశం. తమకు తోచినట్లుగా, స్థాయికి తగినట్లుగా తమ ప్రేయసి/ప్రియుడికి ఏదో ఒక బహుమతి ఇచ్చి మనసులోని మాటను ప్రపోజ్ చేస్తారు. 
 
ఎర్ర గులాబీలతో చేసిన ఓ బొకేను ఇచ్చి ప్రేమను వ్యక్తం చేయవచ్చు. అమ్మాయిలకు పువ్వులు, అందులోనూ ఎర్ర గులాబీలంటే చాలా ఇష్టం. ఇంకా చాక్లెట్లు ఇచ్చి ప్రపోజ్ చేయొచ్చు. కానుకల రూపంలో ప్రపోజ్ చేయవచ్చు. ప్రియురాలి చేతికి ఓ ఉంగరాన్ని తొడుగుతూ ప్రపోజ్ చేయవచ్చు. చాలా మంది ఇలా దూరం నుండి ప్రేమిస్తూ, ఆ విషయాన్ని చెప్పకుండా కాలం గడిపేస్తూ ఉంటారు.
 
కానీ అది సరైన పద్దతి కాదు. ప్రేమ ప్రకటిస్తేనే బాగుంటుంది. అడగనిదే అమ్మయినా అన్నం పెట్టదు అన్న సామెత గుర్తు తెచ్చుకోవాలి. అందుకే మీరు ప్రేమించిన వారికి ప్రపోజల్ డే రోజున ప్రేమ విషయం చెప్పేయడం మంచిది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆస్తమా & ఇన్హేలర్లపై అవగాహన కల్పించడానికి బెరోక్ జిందగి 3వ అధ్యాయం