Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దగ్గరకొచ్చిన వ్యక్తిని ఏదో ఓ వంకతో దూరం పెట్టేస్తే ఇక అంతే సంగతులు

దగ్గరకొచ్చిన వ్యక్తిని ఏదో ఓ వంకతో దూరం పెట్టేయటం తరచుగా జరిగితే ఉంటే మానసిక దూరం పెరగటం ఖాయం. ఇది శరీరాల మధ్య శాశ్వత దూరానికి దారి తీస్తుంది కాబట్టి సెక్స్‌ని సెక్స్‌గా గుర్తించడమే లైంగికపరమైన అసంతృప్తులన్నింటికీ పరిష్కారం అంటున్నారు లైంగిక శాస్త్రజ

దగ్గరకొచ్చిన వ్యక్తిని ఏదో ఓ వంకతో దూరం పెట్టేస్తే ఇక అంతే సంగతులు
చెన్నై , శనివారం, 1 జులై 2017 (06:04 IST)
దగ్గరకొచ్చిన వ్యక్తిని ఏదో ఓ వంకతో దూరం పెట్టేయటం తరచుగా జరిగితే ఉంటే మానసిక దూరం పెరగటం ఖాయం. ఇది శరీరాల మధ్య శాశ్వత దూరానికి దారి తీస్తుంది కాబట్టి సెక్స్‌ని సెక్స్‌గా గుర్తించడమే లైంగికపరమైన అసంతృప్తులన్నింటికీ పరిష్కారం అంటున్నారు లైంగిక శాస్త్రజ్ఞులు. అదేమిటో వారి మాటల్లోనే చూద్దామా?
 
రోజువారీ పనులు, కుటుంబ ఒత్తిళ్లు, పిల్లల చదవులు, కట్టాల్సిన బిల్లులు వీటికి ప్రధమ ప్రాధాన్యం ఇస్తూ దంపతులు సెక్స్‌ను లిస్ట్‌లో చివరికి తోసేస్తూ ఉంటారు. ఎక్కువ శాతం దంపతులందరూ చేసే తప్పే ఇది. ఇలా సెక్స్‌కు మలి ప్రాధాన్యం ఇస్తూ పోతే క్రమక్రమంగా అది కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి అందుకోసం సమయాన్ని కేటాయించుకోవాలి. తీరిక చేసుకోవాలి. ఒకర్నొకరు సంప్రదించుకుని ఏకాంతాన్ని సమకూర్చుకోవాలి.
 
ప్రారంభంలో ముద్దులు, కౌగిలింతలతో ఎక్కువ సమయం గడిపేవాళ్లు తర్వాత వాటికి ప్రాధాన్యమివ్వటం మానేస్తారు. రెండు దేహాల కలయికతో సెక్స్‌ను ముగించేద్దాం అన్నట్టు వ్యవహరించే క్రమంలో కాలక్రమేణా ముద్దులు, కౌగిలింతలు కనుమరుగవుతాయి. కానీ దంపతుల మధ్య తిరిగి లైంగిక మెరుపు మెరవాలంటే దుస్తులతోనే ముద్దులకు పూనుకోవాలి. అప్పుడే ముద్దులు, కౌగిలింతలను పూర్తిగా, స్వచ్ఛంగా ఆస్వాదించగలుగుతారు. వాటితో కొనసాగే సెక్స్‌ అంతకుముందు ఇవ్వనంత సంతృప్తిని అందిస్తుందని లైంగిక నిపుణలు సూచిస్తున్నారు.
 
మనల్ని మన భాగస్వామి ప్రేమిస్తున్నట్టు, ఆకర్షితులవుతున్నట్టు కలిగే భావనను మించిన ఆనందం మరొకటుండదు. ఇలాంటి అనుభూతి పొందాలంటే తరచుగా ఒకర్నొకరు అభినందించుకుంటూ, ప్రశంశించుకుంటూ ఉండాలి. మనల్ని మనం తక్కువగా భావించే సందర్భంలో ఇలాంటి మెచ్చుకోళ్లు మానసిక స్థయిర్యాన్ని అందిస్తాయి. కాబట్టి భాగస్వామిలో నచ్చిన విషయాలను బాహాటంగా పొగడాలి. విమర్శలను సున్నితంగా బయట పెట్టాలి. ఇలాంటి ప్రవర్తన వల్ల పడక గదిలో దంపతుల మధ్య అరమరికల పరదాలు తొలగిపోయి స్వేచ్ఛాయుత లైంగిక జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు.
 
ఒక్కోసారి సెక్స్‌కు మనసు సహకరించదు. ఇది దంపతుల్లో ఇద్దరికీ జరిగేదే! అయితే అందుకు బలమైన కారణం ఉంటే తప్ప సెక్స్‌కు అభ్యంతరం చెప్పకూడదు. దగ్గరకొచ్చిన వ్యక్తిని ఏదో ఓ వంకతో దూరం పెట్టేయటం తరచుగా జరుగుతే ఉంటే మానసిక దూరం పెరగటం ఖాయం. ఇది శరీరాల మధ్య శాశ్వత దూరానికి దారి తీస్తుంది. కాబట్టి ప్రతిసారీ లైంగిక కోరిక లేకపోయినా, స్పందనలు కలగకపోయినా అందుకోసం ప్రయత్నించటంలో తప్పు లేదు. ప్రేరణ కోసం పరిస్థితిని విప్పి చెప్పి భాగస్వామి సహాయం తీసుకోవాలి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కిడ్నీలో రాళ్లు ఎందుకు ఏర్పడుతాయి? జాగ్రత్తలేమిటి?