Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రేమికులెప్పుడూ ఆందోళనగా కనిపిస్తుంటారు... ఎందుకు?

ప్రేమికులెప్పుడూ ఆందోళనగా కనిపిస్తుంటారు... ఎందుకు?
, మంగళవారం, 23 జూన్ 2015 (16:05 IST)
ప్రేమలో పడిన యువతీయువకులు లేదా స్త్రీపురుషులు నిత్యం సంతోషంగా ఉంటారు. చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. తమలో తామే మాట్లాడుకుంటుంటారు. ఆకలి లేదంటారు. నిద్ర రాదంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళు ఎప్పుడెలా ప్రవర్తిస్తారో ఎవరికీ తెలీయదు. అయితే ఇలాంటి ప్రవర్తనకు ప్రేమికులు ఎంతమాత్రామూ బాధ్యులు కాదంటున్నారు పరిశోధకులు. 
 
ప్రేమలో పడినప్పుడు మెదడులోని కొన్ని భాగాలు వివిధ రకాల రసాయనాలను ఎక్కువుగా ఉత్పత్తి చేస్తాయి. వాటి ఫలితంగానే వీరి ప్రవర్తన ఇలా వింతగా ఉంటుందని నిపుణులు చెపుతున్నారు. ఇలాంటి రసాయనాల్లో కొన్నింటి ప్రభావం కింది విధంగా ఉంటుంది. 
 
డోపమైన్ - ఇది అంతులేని ఆనందాన్ని కలిగిస్తుంది. అందుకే ప్రేమపక్షులు ఎప్పుడూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. తిండి సరిగ్గా తినరూ నిద్రపోరు. అయినా ఏమాత్రం నీరసం లేకుండా సంతోషంగా నవ్వుతూనే ఉంటారు. డ్రిలిన్ ఎక్కువుగా విడుదల కావటం వల్ల ఒళ్ళంతా చెమటలు పడతాయి. గుండె వేగంగా కొట్టుకుంటుంది. నోరు తడారిపోతుంది. అందుకే ప్రేమికులెప్పుడూ ఆందోళనగా కనిపిస్తుంటారు. 
 
సెరెటోనిన్ - ఆలోచనలన్నీ ఒకేదానిపైన నిలిచిపోయేలా చేస్తుంది. అందుకే ప్రేమికుల ఆలోచనలెప్పుడూ తన ప్రియురాలు లేదా ప్రేమికుడి చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. చుట్టు పక్కల వారిని, తమ పరిసరాలను ఏమాత్రం పట్టించుకోకుండా తమ ప్రేమ గురించే ఆలోచన చేస్తూ పరధ్యానంగా ఉంటారు. లైంగిక చర్య తర్వాత ప్రేమజంట మధ్య అన్యోన్యతను ఇది పెంచుతుంది.

Share this Story:

Follow Webdunia telugu