Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీ ప్రేయసిని కట్టిపడేయాలా.. కళ్ళజోడు పెట్టుకోండి?

Advertiesment
glasses
, శనివారం, 14 జూన్ 2014 (17:00 IST)
అమ్మాయిలను బుట్టలో పడేయడానికి యువతరం రోజుకో అవతారం ఎత్తుతుంటారు. రోజుకో రకం ప్యాంటు... పూటకో చొక్కా మార్చే వారున్నారు. అంతేనా... జులపాలు పెంచుకుని ప్రత్యేకంగా కనిపించేందుకు పడరాని పాట్లు పడుతుంటారు. ఈ మధ్య కాలంలో చెవులకు లోలాకులు, ముక్కులకు ముక్కుపడకలు కూడా పెట్టుకుంటున్నారు. ఏమంటే అదో ఫ్యాషనని చెప్పేస్తున్నారు. 
 
కానీ ఇటీవల కాలంలో కళ్ళజోడుతోనే మన్మథ కళ ఉట్టి పడుతుందని తేల్చేశారు. వాటి ధారణతో మగవారికి సెక్సీ లుక్ వస్తుందని చెబుతున్నారు. ఎగిరిగంతేసే ఆప్టికల్ షాపుకు బయలుదేరే ముందు అదెందుకో తెలుసుకుని తరువాత ప్రొసీడ్ కండీ...
 
పరిశోధకులు తాజాగా సర్వే నిర్వహించారు. మహిళలు తన భాగస్వామిని ఎన్నుకోవడానికి గల కారణాలపై ఆరా తీశారు. చాలా మంది నుంచి వచ్చిన సమాధానం ఒక్కటే. అదే మగవాళ్ళు  ధరించే కళ్ళజోడు. కళ్ళద్దాలు ధరించే వారు చాలా తెలివైన వారని, మృదుస్వభావావులని మహిళలు భావిస్తున్నారు. ఈ కారణంతోనే వారిపట్ల ఆకర్షితులవుతున్నారు. 
 
పైగా తమకు సరియైన జీవిత భాగస్వామి వారేననే నిర్ణయానికి వచ్చేస్తున్నారు. కళ్ళజోడు ధరించే పురుషులు సెక్సీగా, అందంగా కనిపిస్తుంటారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సర్వేలో దాదాపుగా 96 శాతం మంది మహిళలు ఇవే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. బాయ్స్ ఇంకెందుకు ఆలస్యం.. ఆప్టికల్ షాపుకెళ్లి మీకు నప్పే కళ్ళజోడును ఎంపిక చేసుకోండి. 

Share this Story:

Follow Webdunia telugu