Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లవర్‌పై ఆధిపత్యం చెలాయిస్తున్నారా..?

Advertiesment
Love tips for Men
, శనివారం, 24 జనవరి 2015 (15:35 IST)
పురుషాధిక్యం ఉన్నప్పటికీ.. స్త్రీల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇంకా ప్రేమ, పెళ్లి విషయంలో స్త్రీలను గౌరవించాలి. ఆమె పట్ల ఆధిపత్యాన్ని ప్రదర్శించకూడదు. ప్రియురాలు కూడా మీలా మనిషే అన్న సత్యాన్ని గ్రహించండి. 
 
ఆమెకు స్వతహాగా ఆలోచించే హక్కు ఉందనే విషయాన్ని మరిచిపోకండి. తనపై మీకు ఎలాంటి హక్కు ఉందో, తన పై మీరు ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారో, అధేవిధంగా తను కూడా అవే హక్కులను కలిగి ఉందన్న వాస్తవాన్ని గ్రహించండి. 
 
చాలా మంది పురుషులు వారి ప్రియురాలి పట్ల చాలా తప్పులను చేస్తూ, వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి ప్రవర్తనల వలన ఇద్దరి మధ్యలో అభిప్రాయ భేదాలు కలిగి, ఇద్దరి మధ్య దూరం పెరిగే అవకాశం ఉంది. కావున మీ ప్రియిరాలిని గౌరవిస్తూ ఆమె నిర్ణయాలను గౌరవిస్తూ, ఆమెపై ఆధిపత్యానికి పూనుకోకండి అంటున్నారు మానసిక నిపుణులు. 

Share this Story:

Follow Webdunia telugu