Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భర్తను ప్రేమించాలంటే ఇలా చేయండి.. ఏకాంతంగా ఆకాశంలో నక్షత్రాలను..

Advertiesment
Love tips
, బుధవారం, 27 మే 2015 (19:08 IST)
ప్రేమ పెళ్లైనా.. పెద్దల కుదిర్చిన పెళ్లయినా.. పెళ్లయ్యాక భార్యాభర్తల మధ్య ప్రేమ అనేది కాస్త కొరవడిందనే చెప్పాలి. సామాజిక వెబ్ సైట్ల పుణ్యమా అని భార్యాభర్తల సంబంధాలు సైతం పెటాకులైపోతున్నాయి. వీటికి తోడు బిజీ లైఫ్, ఉద్యోగాలు వంటివి పెళ్లయ్యాక దంపతుల మధ్య చాలా బ్రేక్ ఇస్తున్నాయి. భర్తను లేదా భార్యను పెళ్లికి తర్వాత కూడా ప్రేమించాలంటే.. వారిని ఆకట్టుకునే విధంగా డ్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. శైలి, ప్రాధాన్యతను సమయానికి తగ్గట్టు మార్చుకోవాలి. మంచి డ్రెస్ కాంబినేషన్‌తో పాటు అతనికి ఇష్టమైన సువాసనతో కలిగిన సెంట్‌ను యూజ్ చేస్తే సర్ ప్రెజ్ ఇచ్చినట్లవుతుంది. 
 
అలాగే మీ భర్త లేదా భార్య కొంతకాలంగా ఏదైనా ఒక వస్తువును కొనుగోలు చేయాలనీ ఆలోచిస్తూ ఉండవచ్చు. అప్పుడు మీరు ఆ వస్తువును మీ భర్తకు లేదా భార్యకు కొనిస్తే ప్రేమ మరింత ఎక్కువ కావచ్చు. అది ఒక ప్లే స్టేషన్ కావచ్చు చిన్న చిన్న వస్తువులైనా కావచ్చు.
 
మీ బిజీ జీవితాల కారణంగా కలిసి సమయం గడపటానికి సమయం ఉండకపోవచ్చు. ఇద్దరు కలిసి సమయం గడపటానికి ఉన్న మార్గాల గురించి తెలుసుకోండి. ఇద్దరు కలిసి రొమాంటిక్ వాక్ చేయొచ్చు. ఇద్దరు డాబా మీద కూర్చొని ఆకాశంలో నక్షత్రాలను చూడవచ్చు. ఇద్దరు కలిసి మీ ఇంటిలో క్యాండిల్లైట్ డిన్నర్‌తో కొంత సమయాన్ని గడపవచ్చు. ఇది ఖచ్చితంగా మీ వైవాహిక జీవితంలో ఒక కొత్త ఆకర్షణను జోడిస్తుంది.
 
ఇకపోతే.. స్నేహపూర్వకంగా మీ సమస్యలకు పరిష్కారాలను కనుగొనాలి. తగాదాలు, ఫిర్యాదులకు తావివ్వకూడదు. మహిళలు వారి పట్ల ఎక్కువగా శ్రద్ద చూపితే వారు దానిని ప్రేమ అని అనుకుంటారు.

కాబట్టి, మీ చర్యల ద్వారా దానినే చూపించండి. ఆ సమయంలో ఒకసారి, మీరు అతని లంచ్ బాక్స్‌లో లక్కీ అని ఒక చిన్న నోట్ పెట్టండి. అతను ఆఫీసు నుండి తిరిగి వచ్చినప్పుడు కౌగిలి మరియు ముద్దు పెట్టండి. ఈ చిన్న హావభావాలు తప్పనిసరిగా ప్రేమను చిగురింపజేస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu