Publish Date: Wed, 31 Dec 2014 (17:05 IST)
Updated Date: Wed, 31 Dec 2014 (17:07 IST)
ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్నారా.. అయితే సమాజం గురించి పట్టించుకుంటున్నారా?. సొసైటీ విమర్శలకు ఒక సారాంశం వంటిది. కచ్చితంగా భవిష్యత్తు కోసం సొసైటీ విమర్శల మీద ఆధారపడకూడదని మానసిక నిపుణులు అంటున్నారు.
పెద్దల అంగీకరారంతో ప్రేమ వివాహం చేసుకుని భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటూ.. జీవితంలో గెలిచి చూపిస్తే సమాజపు నోటికి కళ్లెం వేసినట్లు అవుతుందని వారు సలహా ఇస్తున్నారు.
అలాగే ప్రేమ వివాహానికి సిద్ధమైనప్పుడు తల్లిదండ్రుల నుంచి అభ్యంతరాలు తలెత్తడం సహజం. అందుచేత అందుకు తగ్గట్టు మైండ్‌ను సిద్ధంగా ఉంచుకోండి. వారిని ఒప్పించే ప్రయత్నం చేయండి. భాగస్వామి యోగ్యతను నిరూపించుకోవాలని మానసిక నిపుణులు అంటున్నారు.