Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లవ్ ప్రపోజ్ చేస్తున్నారా..? అయితే ఈ టిప్స్ పాటించండి గురూ..!

లవ్ ప్రపోజ్ చేస్తున్నారా..? అయితే ఈ టిప్స్ పాటించండి గురూ..!
, శుక్రవారం, 18 డిశెంబరు 2015 (16:22 IST)
ప్రేమ వ్యవహారాలు సాధారణంగా స్నేహం నుంచే మొదలవుతాయి. ఎవరైనా ఒకరు నచ్చినప్పుడు వారితో ముందుగా స్నేహం చేసుకుంటారు. ఆ తరువాత తమలో వున్న భావాలను, ఇష్టాయిష్టాలను తెలుసుకుని, అనుకోకుండా ప్రేమలో పడిపోతారు.

ప్రేమ అనేది ఒక మధురానుభూతి. ముఖ్యంగా ప్రేమ అబ్బాయిల విషయంలో చాలా గందరగోళంగా వుంటుంది. నచ్చిన అమ్మాయికి తమలో వున్న ప్రేమను తెలియజేయడానికి రకరకాల పద్ధతులను అనుసరిస్తుంటారు. అమ్మాయిలు ఎక్కడికివెళితే అక్కడికి వెళ్తుంటారు. అమ్మాయిలకు నచ్చిన విధంగా తమను తాము మార్చుకుంటారు. 
 
ఇటువంటి ప్రయత్నాలలో కొంతమంది విజయాన్నిసాధిస్తారు. తమ ప్రేమను తెలియజేసి అమ్మాయిల మనసులను గెలుచుకుంటారు. కొంతమంది అబ్బాయిలు తమలో వున్న ప్రేమానుభావాలను అమ్మాయితో చెప్పుకోలేక ఇబ్బంది పడుతుంటారు. వారితో కలవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. తమ ప్రేమ గురించి తెలియజేసేందుకు ధైర్యం చాలక వాటిని మనసులోనే దాచుకుని సతమతమవుతారు. తమలో వున్న భావాలను ఎలా వ్యక్తపరచాలో తెలియక ప్రత్యక్షంగా వెళ్లి అమ్మాయిలను ప్రపోజ్ చేసేస్తారు. ఒకవేళ వారికి నచ్చితే ఫరువాలేదు కానీ.. నచ్చకపోతే తీవ్ర అవమానాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. 
 
అయితే అటువంటి వారికోసం కొన్ని చిట్కాలను చూద్దాం.....
ప్రస్తుత కాలంలో ప్రతిఒక్కరు తమ ప్రేమ విషయాలను సెల్ ఫోన్‌‌ల ద్వారా, ఫేస్ బుక్ ద్వారా తెలియజేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఇష్టాఇష్టాలు ఎదురుగా తెలియజేయడానికి అవకాశం ఉండదు. వీలైనంతవరకు ఉత్తరం రాయడానికి ఆశక్తి చూపించండి. ఎందుకంటే ఒక కాగితంలో మన మనసులోని భావాలు రాయడం ద్వారా ఎదుటివారు త్వరగా ఆకర్షితులవుతారు.
 
పూర్వకాలంలో రాజులు ప్రేమ లేఖలు రాసి పావురాలతో ఇచ్చి పంపేవారు. అలాంటి ప్రేమలో వారు విజయం సాధించారు. కాగితంలో రాసే అక్షరాలు మన మనసులో దాగివున్న భావాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇలా చేయడం వల్ల ప్రేమ ఇంకా బలపడుతుంది.
 
మీరు ప్రేమిస్తున్నఅమ్మాయైన, అబ్బాయైన  మీ మనసులోని భావాలను తెలిపేముందు వారి ఇష్టాఇష్టాలను తెలుసుకోండి. వారికి నచ్చిన స్థలానికి తీసుకెళ్ళి మీ మనుసులో వున్న భావాలను తెలియజేయండి. అప్పుడే ఇతరుల మనుసులో వున్న భావాలను తేలికగా అర్థం చేసుకోవచ్చు. అప్పుడు ఫలితం దక్కుతుంది.
 
మీరు మీరుగానే వుండి మీ మనసులోని భావాలను వ్యక్తపరిస్తేనే చాలామంచిది. అమ్మాయిలు కూడా అటువంటివాళ్లనే ఇష్టపడతారు. అనవసరమైన విచిత్రచేష్టలు చేయకుండా మీకు మీరుగానే మీ మనసులోని భావాలను వ్యక్తపరిచేందుకు ట్రై చేయండి.
 
మీరు ప్రేమిస్తున్న అమ్మాయి గురించిగాని, ప్రేమ వ్యవహారం గురించి కాని స్నేహితులకు తెలియనివ్వకుండా జాగ్రత్త తీసుకుంటే మంచిది. ఎందుకంటే కొంతమంది అమ్మాయిలు తమ ప్రేమ వ్యవహారాలను స్నేహితుల నుంచి తెలుసుకోవడం ఇష్టపడరు. కాబట్టి ప్రేమ విషయాలలో మీ అంతట మీరుగా పూనుకోవడమే మంచిది.

Share this Story:

Follow Webdunia telugu